Nandu Bigg Boss: ఇండియాకు వచ్చి అడ్డంగా ఇరుక్కుపోయింది స్టార్ యూట్యూవర్ రమా నందన. వీసా స్కానమ్ లో చిక్కుకున్న రమా నందన సడెన్ గా ఇండియాకు వచ్చింది. ఆమె బిగ్ బాస్ లోకి వెళ్లాలని అనుకుందా? నిజమెంత?
సోషల్ మీడియా సంచలనం, డిజిటల్ క్రియేటర్ రమా నందన (నందు) అరెస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూకేలో నివసిస్తూ యూట్యూబ్ వీడియోలు, వ్లాగ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఈమె ఎంతో దగ్గరైంది. సహజమైన శైలి, చమత్కారమైన సంభాషణలతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న నందు, వీసా స్కామ్‌లో ఇరుక్కుని ఇబ్బందుల్లో పడింది. ఆమెతో పాటు ఆమె భర్త మధుకర్‌పై కూడా 'లుక్ అవుట్' నోటీసు ఉంది. కాగా, ఇటీవల నందు ఇండియాలో ల్యాండ్ అవ్వడం, పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె ఇండియా పర్యటన వెనుక అసలు కారణం ఏమిటనే దానిపై అనేక రకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి.
24
బిగ్ బాస్ ఎంట్రీపై జోరుగా ప్రచారం
నందు అలియాస్ రమా నందన ఇండియాకు రావడమే ఆలస్యం, ఆమె ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్' కొత్త సీజన్‌లో పాల్గొనడానికే వచ్చిందనే ప్రచారం ఊపందుకుంది. ప్రతి ఏటా బిగ్ బాస్ నిర్వాహకులు ఎంతోమంది సోషల్ మీడియా సెలబ్రిటీలను, యూట్యూబర్లను హౌస్‌లోకి పంపించే ఆనవాయితీ ఉంది. ఈ క్రమంలోనే యూకేలో ఉంటున్న రమా నందనను ప్రత్యేకంగా సంప్రదించి, భారీ ఆఫర్‌తో ఇండియాకు రప్పించారంటూ నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. యూట్యూబ్‌లో ఆమెకున్న ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు ఆమె పేరును ఖరారు చేశారని అభిమానులు సైతం భావించారు. ఇప్పటికే బిగ్ బాస్ ప్రారంభమైంది. దాంతో యూట్యూబర్ నందుని 'వైల్డ్ కార్డ్ ఎంట్రీ' ద్వారా హౌస్‌లోకి పంపించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
34
ఇండియా పర్యటన వెనుక అసలు నిజం?
అయితే తన ఇండియా పర్యటనపై, బిగ్ బాస్ ఎంట్రీపై వస్తున్న ప్రచారాలపై ఎలాంటి క్లారిటీ లేదు. బిగ్ బాస్ విషయంలో రమా నందన కూడా స్పందించలేదు. గత సీజన్‌లో కూడా ఈమె పేరు గట్టిగా వినిపించింది. ఈ మధ్య కాలంలో ఆమె పాపులారిటీ బాగా పెరిగింది. చిరంజీవి హీరోగా నటించిన 'మన శంకర్ వరప్రసాద్ గారు' సినిమాలో కూడా ఆమె నటించింది. అయితే రమా నందన బిగ్ బాస్ కోసమే ఇండియాకు వచ్చిందా? లేక వ్యక్తిగత పనుల నిమిత్తం కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి హైదరాబాద్ వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది.
యూట్యూబ్‌లో తనదైన కంటెంట్‌తో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తున్న నందు, కేవలం వీడియోలకే పరిమితం కాకుండా నెటిజన్లతో నిరంతరం టచ్‌లో ఉంటుంది. ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఆమె తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే కొందరు ఆడియన్స్ ఆమె బుల్లితెరపై లేదా వెబ్ సిరీస్‌లలో కనిపించే అవకాశం ఉందని భావించారు. అనుకున్నట్టుగానే సినిమాల్లో అవకాశాలు సాధించిన నందు, బిగ్ బాస్‌లోకి కూడా వెళ్తోందని ప్రచారం జరిగింది. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుంది? ఈ కేసు ఎక్కడివరకు వెళ్తుందో వేచి చూడాలి.