Bigg Boss Voting: బిగ్ బాస్ తొలివారంలోనే గొడవలు మొదలైపోయాయి. ఇంకా చెప్పాలంటే మొదరటిరోజే మొదలయ్యాయని చెప్పాలి. సోమవారం నామినేషన్లు కూడా గట్టిగానే జరిగాయి. అయితే ఓ కామనర్ మాత్రం ఓట్లలో దూసుకుపోతున్నాడు.
గ్రాండ్‌గా మొదలైన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 మొదటి వారంలోనే తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. హౌస్‌లోకి అడుగుపెట్టిన మొత్తం 16 మంది కంటెస్టెంట్లు తొలి వారంలోనే నామినేషన్లలోకి రావడంతో ఓటింగ్ పోరు మలుపు తిరిగింది. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కామనర్ కేటగిరీ నుంచి అగ్నిపరీక్ష ద్వారా హౌస్‌లోకి వచ్చిన రోహిత్ నాయుడు ఓటింగ్‌లో ఏకపక్ష ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న అనధికారిక పోలింగ్ లెక్కల ప్రకారం, రోహిత్ దాదాపు 30.74 శాతం ఓట్లతో ఏకంగా 9,953 ఓట్లను కొల్లగొట్టి టాప్ పొజిషన్‌లో దూసుకుపోతున్నాడు. హౌస్‌లో ప్రవేశించిన తొలి రోజుల్లోనే ప్రముఖ నటుడు త్రిగుణ్‌తో జరిగిన వాగ్వాదంతో పాటు, అతని నిక్కచ్చి ఆటతీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
23
రెండో స్థానంలో ముఖేష్ గౌడ
రోహిత్ మొదటి స్థానంలో తిరుగులేని స్పష్టతతో కొనసాగుతుండగా, రెండో స్థానం కోసం మాత్రం బుల్లితెర సెలబ్రిటీల మధ్య ఊహించని టఫ్ ఫైట్ నడుస్తోంది. 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ 10.75 శాతం (3,480 ఓట్లు) సాధించి రెండో స్థానంలో ఉండగా, జబర్దస్త్ ఆటో రాంప్రసాద్ 10.69 శాతం (3,461 ఓట్లు) తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి మధ్య వ్యత్యాసం కేవలం 19 ఓట్లు మాత్రమే కావడంతో క్షణక్షణానికీ స్థానాలు మారేలా హోరాహోరీ పోరు సాగుతోంది. వీరి తర్వాతి స్థానాల్లో ఆర్జే చరణ్ 7.73 శాతంతో (2,503 ఓట్లు) నాలుగో స్థానంలో, అమన్ మసూద్ 7.60 శాతంతో (2,462 ఓట్లు) ఐదో స్థానంలో నిలిచి సేఫ్ జోన్‌లో ఉన్నారు. ఇక మధ్యస్థానాల్లో సీరియల్ నటి దేబ్జానీ మోదక్ (4.36%), సింగర్ ఝాన్సీ (4.26%), నటుడు త్రిగుణ్ (3.86%), జబర్దస్త్ నరేష్ (3.57%), షాలిని (3.28%) ఓట్లతో నిలకడగా కొనసాగుతున్నారు.
33
ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్
మొదటి వారం ఎలిమినేషన్ గండం ప్రధానంగా ఆరుగురు కంటెస్టెంట్లను తీవ్రంగా భయపెడుతోంది. మూడు శాతం కంటే తక్కువ ఓట్లు సాధించిన యాంకర్ సుధీర్ రెడ్డి (2.63%), మోడల్ సృష్టి వ్యాకరణం (2.18%), టెంపర్ వంశీ (2.16%), నటుడు కృష్ణుడు (2.10%), యాంకర్ వర్షిణి (2.07%), నటి చైత్ర రాయ్ (2.02%) ప్రస్తుతం రెడ్ జోన్ (డేంజర్ జోన్) లో చిక్కుకున్నారు. వీరి మధ్య ఓట్ల తేడా పాయింట్లలోనే ఉండటంతో చివరి నిమిషం వరకు ఎవరి స్థానం ఎక్కడికి చేరుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. సెలబ్రిటీల కంటే కామనర్లకే ప్రేక్షకులు అధికంగా జైకొడుతున్న ఈ ట్రెండ్‌లో, కనీస ఓటింగ్ కూడా రాబట్టలేకపోతున్న ఈ ఆరుగురిలోంచే మొదటి వారం ఎలిమినేషన్ వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.