ఆంటీలా అవుతున్నావ్, నీ షేప్స్ చూసుకో.. హీరోయిన్ పై దారుణమైన కామెంట్స్, నటి ఎమోషనల్..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 08, 2022, 10:06 AM IST

బెంగళూరు బ్యూటీ నందిత శ్వేతా తాజాగా ఇంస్టాగ్రామ్ లో చేదు అనుభవం ఎదుర్కొంది. ఓ నెటిజన్ నందిత శ్వేతాని అత్యంత దారుణంగా కామెంట్స్ చేశాడు.

PREV
17
ఆంటీలా అవుతున్నావ్, నీ షేప్స్ చూసుకో.. హీరోయిన్ పై దారుణమైన కామెంట్స్, నటి ఎమోషనల్..

సోషల్ మీడియా అనేది హీరోయిన్లకు ఎంత ఉపయోగమో అదే స్థాయిలో ఇబ్బందులు కూడా ఉంటాయి. నటీమణులు తరచుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారీన పడుతుంటారు. కొందరు ఆకతాయి నెటిజన్లు హీరోయిన్లని ఉద్దేశించి అసభ్యకరమైన కామెంట్స్ చేయడం.. వారు లైవ్ లో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టెలా ప్రశ్నలు అడగడం చూస్తూనే ఉన్నాం. 

27

బెంగళూరు బ్యూటీ నందిత శ్వేతా తాజాగా ఇంస్టాగ్రామ్ లో చేదు అనుభవం ఎదుర్కొంది. ఓ నెటిజన్ నందిత శ్వేతాని అత్యంత దారుణంగా కామెంట్స్ చేశాడు. నందితపై బాడీ షేమింగ్ కి దిగాడు. ఆమె మనసు నొప్పించేలా కామెంట్స్ చేసిన ఆకతాయి నెటిజన్ కి నందిత అదే స్థాయిలో బుద్ధి చెప్పింది. 

37

వివరాల్లోకి వెళితే.. నందిత ఇటీవల ట్రెండీ అవుట్ ఫిట్ లో గోడకు అనుకుని ఉన్న అందమైన స్టిల్స్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. చాలా మంది నెటిజన్లు, అభిమానులు బ్యూటిఫుల్ గా ఉన్నావు అంటూ కెమెంట్స్ పెట్టారు. కానీ ఓ ఆకతాయి మాత్రం అసభ్యంగా ప్రవర్తించాడు. 

47

'నీ బాడీ షేప్స్ ఒకసారి చూసుకో.. ఆంటీలా మారిపోతున్నావ్. కొంచెం వర్కౌట్స్ చేయి అంటూ దారుణమైన కామెంట్స్ చేస్తూ సలహా ఇచ్చాడు. అతడు చేసిన కామెంట్స్ కి నందిత శ్వేతా ఎమోషనల్ ఐంది. అతడికి అంతే ఘాటుగా బుద్ది చెప్పింది. 

57

'ఇలాంటి వారితో నరకం అనిపిస్తుంది. నేను కూడా మనిషినే.. నాకూ ఇబ్బందులు ఉంటాయి. నేను దేవతని కాదు కదా. కానీ ఇలా మనసుని బాధపెట్టే విధంగా ఎలా కామెంట్స్ చేస్తారు. నా బాడీని, నేనిప్పుడు కనిపిస్తున్న విధానాన్ని ఇష్టపడతాను. నా లైఫ్ లో ఈ దశని ఎంజాయ్ చేస్తున్నాను అంటూ అతడికి నందిత రిప్లై ఇచ్చింది. దీనితో నెటిజన్లు కూడా మీకు మద్దతు తెలుపుతున్నారు. 

67

ఇదిలా ఉండగా నందిత సౌత్ లో మంచి నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఎక్కువగా తెలుగు, తమిళ భాషల్లో నటించింది. తెలుగులో నందిత శ్వేతా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నందిత శ్రీనివాస కళ్యాణం, ప్రేమ కథా చిత్రం 2, కపటధారి, అక్షర లాంటి చిత్రాల్లో మెరిసింది. 

77

ప్రస్తుతం నందిత బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఢీ 14 షోలో నందిత.. జానీ మాస్టర్ తో కలసి జడ్జిగా వ్యవహరిస్తోంది. నందిత లుక్స్, ఆమె గ్లామర్ తెలుగు యువతకు బాగా నచ్చాయి. అందుకే నందిత గ్లామర్ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. 

click me!

Recommended Stories