నందిని రెడ్డి తన గురించి పలు షాకింగ్ విషయాలను, ఆసక్తికర విషయాలను, ఎవరికీ తెలియని ఫ్యాక్ట్స్ ని వెల్లడించింది. మగరాయుడి గెటప్ గురించి చెబుతూ, తాను చిన్నప్పట్నుంచి స్పోర్ట్స్ ఆడేదట. ఆ సమయంలోనే ప్యాంట్, టీషర్ట్ కంఫర్ట్ గా ఉండేవి, టీనేజ్‌లో అదే తనకు బాగా అలవాటు అయ్యిందట. దాన్నే ఫాలో అవుతున్నట్టు చెప్పింది. లేడీస్‌కి సంబంధించిన చీరలు, స్కర్ట్స్ కూడా తాను ధరించానని, కాకపోతే చాలా అరుదుగానే వాటిని ధరించినట్టు చెప్పింది. ఫంక్షన్లు, ఇంట్లో మాత్రమే వాటిని ధరిస్తానని, కానీ తనకు ఏదైనా కంఫర్ట్ గా ఉంటుందో అవే వేసుకుంటానని చెప్పింది నందిని రెడ్డి. చిన్నప్పట్నుంచి బైక్ నడిపేదాన్ని అని, అందుకు కంఫర్ట్ కోసం కూడా ప్యాంట్ షర్ట్ వేసేదాన్ని అని చెప్పింది నందిని రెడ్డి.