‘దేవర’కొత్త రిలీజ్ డేట్, పవన్ సరే, దుల్కర్ పరిస్దితి ఏంటి?

First Published Jun 12, 2024, 11:30 AM IST

 ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో  ఫుల్ బిజీగా ఉన్న  పరిస్థితుల్లో షూటింగ్ పూర్తి చేసి  ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ చేసాలా కనిపించడం లేదు. దీంతో ఆ డేట్‌కి దేవరను దింపాలని మూవీ టీమ్ అనుకుంటున్నట్లు సమాచారం.

Devara

 
సరైన రిలీజ్ డేట్  లేకపోతే ఆ ఇంపాక్ట్ వెళ్లి కలెక్షన్స్ పై పడుతుంది. అందుకే పెద్ద సినిమాల వాళ్లు ఆచి,తూచి తమ సినిమా రిలీజ్ డేట్స్ ప్రకటిస్తూంటారు. అయితే అనుకున్న తేదీకు సినిమా తేవటం కూడా పెద్ద యజ్ఞమే. రకరకాల కారణాలుతో సినిమాలు లేటు అవుతూంటాయి. దాంతో మిగతా సినిమాలు వాళ్లు వచ్చి ఆ రిలీజ్ డేట్ ని తాము రావటానికి ప్రయత్నిస్తూంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ ‘దేవర’చిత్రం అదే చేయబోతోందని వినికిడి. వివరాల్లోకి వెళితే..


 జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రికొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రస్తుతం గోవాలో యాక్షన్ సన్నివేశాలు షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ మూవీని మొదట ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో.. విడుదల తేదీని దసరాకు మార్చారు. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవరను విడుదల చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. తాజాగా ఈ డేట్ ను కూడా మార్చాలని మూవీ టీమ్ భావిస్తోందని సమాచారం. అయితే ఈసారి డేట్ ప్రీ పోన్ చేస్తున్నారట. అంటే ముందే వచ్చేస్తుందన్నమాట.


గత కొన్ని రోజులుగా దేవర సెప్టెంబర్ 27కి ప్రీపోన్ అవుతుందని సోషల్ మీడియాలోనూ, ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది వాస్తవానికి సెప్టెంబర్ 27న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో  ఫుల్ బిజీగా ఉన్న  పరిస్థితుల్లో షూటింగ్ పూర్తి చేసి  ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ చేసాలా కనిపించడం లేదు. దీంతో ఆ డేట్‌కి దేవరను దింపాలని మూవీ టీమ్ అనుకుంటున్నట్లు సమాచారం. దీనిపై దాదాపు ఫిక్స్ అయినట్లు వినిపిస్తోంది. త్వరలోనే రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


మరో ప్రక్క యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా లక్కీ భాస్కర్ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే రిలీజైన  టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ మూవీపై అంచనాలు చాలా ఉన్నాయి.   లక్కీ భాస్కర్ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్   అధికారికంగా ప్రకటించింది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఇప్పుడు వారు వెనక్కి వెళ్తారా లేక దేవర తో పోటీ పడతారా అనేది తెలియాల్సి ఉంది. 


గత ఏడాది రిలీజ్ అయిన సార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ కు దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేశారు వాస్తవానికి  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ పోస్ట్ పోన్ అవ్వనున్నట్లు కాస్త క్లారిటీ వచ్చింది. దీంతో లక్కీ భాస్కర్ సోలోగా రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాకు పోటీగా దేవర చిత్రం రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. 


ఈ పోటి సరిపోదన్నట్లు కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ యాక్ట్ చేస్తున్న అమరన్ కూడా సెప్టెంబర్ 27న రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా వరల్డ్ వైడ్ గా వివిధ భాషల్లో విడుదల అవ్వనుంది. త్వరలోనే రిలీజ్ డేట్ పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇండియన్ ఆర్మీ రాజ్‌ పుత్ రెజిమెంట్‌ ఆఫీసర్‌ గా పనిచేసిన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా అమరన్ మూవీ తెరకెక్కుతోంది. తీవ్రవాద నిరోధక ఆపరేషన్ సమయంలో ఆయన చర్యలకు గాను మరణానంతరం ప్రతిష్టాత్మక అశోక చక్ర లభించింది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న అమరన్ సినిమాను కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
 

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత వస్తున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ చిత్రం కావడంపై ‘దేవర పార్ట్‌ వన్‌’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్‌ ‘అభిమానులు కాలర్‌ ఎగరేసుకునేలా చిత్రం ఉంటుంది’ అని కామెంట్‌ చేసి అభిమానుల్లో జోష్‌ పెంచారు.

తాజాగా ఓ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ ‘ఎన్టీఆర్‌కు, ఆయన అభిమానులకు ఈ సినిమా కచ్చితంగా ప్రత్యేకంగా ఉంటుంది. త్వరలో అప్‌డేట్స్‌ వస్తాయి’ అన్నారు. ఈ నెల 20 ఎన్టీఆర్‌ బర్త్‌డే కావడంతో ఆ రోజు ‘దేవర చిత్రం నుంచి సర్‌ప్రెజ్‌ ఉంటుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Latest Videos

click me!