నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఫ్యాన్స్ ని అందని ద్రాక్షలాగా ఊరిస్తూనే ఉంది. ఆ మధ్యన ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రాన్ని ప్రకటించారు. ఆ చిత్ర ప్రీ ప్రొడక్షన్ ఎంత వరకు వచ్చిందో తెలియదు. ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ చిత్రం ఆగిపోయింది అని కూడా వార్తలు వచ్చాయి. కొంతమంది చెబుతున్న దాని ప్రకారం.. మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ చిత్రం ఆగిపోలేదని.. తాత్కాలికంగా బ్రేక్ పడింది అని అంటున్నారు.