పుష్ప 2లో వాడు దొంగ కాకపోతే మహానుభావుడా ? రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ పై అల్లు అర్జున్ షాకింగ్ రియాక్షన్

First Published | Jan 8, 2025, 5:33 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ చిత్రం బాహుబలి 2 రికార్డులని కూడా పుష్ప 2 బ్రేక్ చేసింది. పుష్ప 2 విడుదలయ్యాక అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వివాదంలో చిక్కుకున్నాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ చిత్రం బాహుబలి 2 రికార్డులని కూడా పుష్ప 2 బ్రేక్ చేసింది. పుష్ప 2 విడుదలయ్యాక అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వివాదంలో చిక్కుకున్నాడు. అరెస్ట్ కావడం, బెయిల్ రావడం జరిగింది. ఇది పక్కన పెడితే పుష్ప 2 చిత్రంపై చాలా మంది పెదవి విరిచారు. 

అల్లు అర్జున్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో లాంటి చిత్రాల్లో కలసి నటించిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పుష్ప 2పై ఆ మధ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల వస్తున్న చిత్రాలు చాలా దారుణంగా ఉంటున్నాయి అని చెప్పే క్రమంలో.. వాడెవడో ఎర్ర చందనం దొంగ అంట.. వాడిని కూడా హీరోగా చూపించారు అంటూ పుష్ప 2పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. 


ఆ వ్యాఖ్యలపై తాజాగా రాజేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చారు. షష్టిపూర్తి చిత్ర మీడియా సమావేశంలో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ పుష్ప 2 పై చేసిన కామెంట్స్ కి వివరణ ఇచ్చారు. మీడియా ప్రతినిధులు దీని గురించి ప్రశ్నించగా.. నేను ఎవరి గురించి కూడా నెగిటివ్ గా మాట్లాడాలి అనే స్వభావం ఉన్న వ్యక్తిని కాదు. అల్లు అర్జున్ ని రీసెంట్ గా కలిశా. అంకుల్ మీరు అలా మాట్లాడి ఉండరు అని తెలుసు అని అన్నాడు. పిచ్చోడా నేను నిజంగానే మాట్లాడాను అని చెప్పా.. అయినా కూడా మీ ఉద్దేశం అది కాదు అని అల్లు అర్జున్ చెప్పాడు. కరెక్ట్ నా ఉద్దేశం అది కాదు. 

సోషల్ మీడియాలో ఇప్పుడు నెగిటివిటి బాగా పెరిగిపోయింది. ఏం మాట్లాడినా నెగిటివ్ గానే ట్రోల్ చేస్తున్నారు. నా కెరీర్ లో నేను కూడా నెగిటివ్ రోల్స్ చేశాను. లేడీస్ ట్రైలర్, అప్పుల అప్పారావు, పేకాట పాపారావు లాంటి చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేశాను. నా పాత్రలని నేనే తిట్టుకున్నా. నెగిటివ్ రోల్స్ కాబట్టి అలాగే అంటాం. పుష్ప 2 గురించి కూడా అదే ఉద్దేశంతో చెప్పా. పుష్ప 2 లో వాడు దొంగ కాకపోతే మహానుభావుడా .. మామూలు దొంగ కూడా కాదు..ఎర్రచందనం దొంగ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అదే విధంగా రాజేంద్ర ప్రసాద్ తన పద్మ శ్రీ అవార్డు ఇంతవరకు రాకపోవడం గురించి కూడా సెటైరికల్ కామెంట్స్ చేశారు. మీ తర్వాత వచ్చిన యంగ్ హీరోయిన్లకు కూడా పద్మ శ్రీ ఇస్తున్నారు. మీకెందుకు ఆ గౌరవం దక్కడం లేదు అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఏమో వాళ్ళు నాకంటే ట్యాలెంట్ ఉన్నవాళ్ళేమో అంటూ సెటైర్లు వేశారు. పద్మ శ్రీ అవార్డులు పొందాలంటే వేరే మార్గాలు ఉంటాయేమో.. అవి నాకు తెలియదు. ఒకసారి రామోజీ రావు గారు నన్ను అడిగారు.. ప్రసాద్ నీకు పద్మశ్రీ ఉందా అని ప్రశ్నించారు. లేదండి అని చెప్పా. నువ్వెప్పుడూ పద్మశ్రీ కోసం ప్రయత్నించకు. ఎందుకంటే పద్మశ్రీ కంటే నువ్వే ఎక్కువ అని అన్నారు. ఆయన మాటలే నాకు 10 పద్మశ్రీ లతో సమానం అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 

Latest Videos

click me!