‘తారక్ తో నా బంధాన్ని ఎవరూ తెంచలేరు.. ఆ ఆలోచన మానుకోండి’.. స్పందించిన కళ్యాణ్ రామ్

Published : Dec 26, 2023, 07:40 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ Nandamuri Kalyan Ram  ప్రస్తుతం ‘డెవిల్’ మూవీ ప్రమోషన్స్ లో ఉన్నారు. ఈ సందర్భంగా కొన్ని రూమర్ల వస్తుండగా.. ఎన్టీఆర్, తనకు ఉన్న బంధంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. 

PREV
16
‘తారక్ తో నా బంధాన్ని ఎవరూ తెంచలేరు.. ఆ ఆలోచన మానుకోండి’.. స్పందించిన కళ్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఎన్నో ఫ్లాప్స్ ను చూసి.. చివరికి గతేడాది ‘బింబిసార’తో బౌన్స్ బ్యాక్ అయ్యారు. బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఆ వెంటనే ‘అమిగోస్’తో వచ్చారు. ప్రస్తుతం ‘డెవిల్’ మూవీ Devil ప్రమోషన్స్ లో ఉన్నారు. 

26

బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా అలరించబోతున్నారు. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. డిసెంబర్ 29న విడుదల కాబోతోంది. 

36

ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. బింబిసార, అమిగోస్ సినిమాలను ప్రచారం చేసిన ఎన్టీఆర్ NTR ఈ సినిమాపై మౌనంగా ఉండటంతో అన్నదమ్ముల మధ్య విబేధాలు ఉన్నాయంటూ పుకార్లు సృష్టించారు. దీనిపై తాజాగా కళ్యాణ్ రామ్ స్పందించారు. 
 

46

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తారక్, కళ్యాణ్ రామ్ బంధంపై వస్తున్న రూమర్లపై స్పందించారు. ఘాటు రిప్లై ఇచ్చారు. ‘మాది అన్నదమ్ముల అనుబంధం. తారక్ తో నా బంధాన్ని ఎవరూ చెరపలేరు. తుడిచేయలేదురు. ఇది గుర్తుంచుకోండి.

56

ట్వీట్, తదితర నిర్ణయాల్లో మేమంతా ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఈవెంట్ల విషయంలోనూ మీకు ఉన్న అపోహలను మైండ్ లోని ఫస్ట్ తొలగించండి.’ అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ కాస్తా ఎమోషనల్ అయ్యారు. 

66

ఇక కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ NTRపై ఎంతటి ప్రేమను చూపిస్తారో తెలిసిందే. తమ్ముడైనా నాన్నగా భావిస్తుంటారు. అలాగే పిలుస్తుంటారు కూడా. ఈ క్రమంలో వీరిద్దరి బాండింగ్ పై రూమర్లు రావడం బాధాకరం. మొత్తానికి కళ్యాణ్ రామ్ స్పందనతో అవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.  

click me!

Recommended Stories