'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' టీజర్ రివ్యూ, కళ్యాణ్ రామ్, విజయశాంతి మధ్య పెద్ద యుద్ధమే ప్లాన్ చేశారుగా
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న క్రేజీ యాక్షన్ చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న క్రేజీ యాక్షన్ చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న క్రేజీ యాక్షన్ చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే టీజర్ విడుదలైంది.
చాలా ఏళ్ళ తర్వాత విజయశాంతి ఈ చిత్రంలో ఖాకీ డ్రెస్ లో కనిపిస్తున్నారు. విజయశాంతి ఖాకీ డ్రెస్ లో కనిపించడం ఫ్యాన్స్ కి ఐఫీస్ట్ అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో విజయశాంతి కళ్యాణ్ రామ్ తల్లిగా నటిస్తున్నారు. టీజర్ లో సెంటిమెంట్ సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయి. '10 ఏళ్ళ కెరీర్ లో ఎన్నో ఆపరేషన్స్ చేశా, చావుకి ఎదురెలుతున్న ప్రతి సారీ నా కళ్ళముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్' అంటూ విజయశాంతి ఎమోషనల్ డైలాగులు చెబుతోంది.
తనలాగే తన కొడుకు కూడా పోలీస్ అధికారి కావాలని విజయశాంతి కలలు కంటూ ఉంటుంది. కానీ చివరికి అర్జున్ డాన్ లాగా మారినట్లు చూపించారు. రేపటి నుంచి వైజాగ్ ని పోలీసు బూట్లు, నల్ల కోట్లు కాదు.. ఈ అర్జున్ విశ్వనాథ్ కనుసైగలు శాసిస్తాయి అంటూ కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ డైలాగ్ చెబుతున్నారు.
చచ్చింది శత్రువైనా, చంపింది బంధువైనా నా కళ్ళ ముందు నేరం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ విజయశాంతి శపథం చేస్తున్నారు. అంటే తల్లి కొడుకుల మధ్య శత్రుత్వం ఏర్పడుతున్నట్లు టీజర్ లో చూపించారు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్, విజయశాంతి మధ్య ఫేస్ ఆఫ్ సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో విజయశాంతి మాట్లాడుతుండగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. డైరెక్టర్ ఈ చిత్ర స్టోరీ లైన్ చెప్పగానే నచ్చేసింది. కానీ ఇంకా బెటర్ చేయాలని అడిగాను. దర్శకుడు ఏడాది కష్టపడి మంచి సన్నివేశాలతో కథని తీర్చి దిద్దారు. దీని వెనుక కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు అని విజయశాంతి చెప్పింది. వెంటనే కళ్యాణ్ రామ్ అడ్డుకుని.. అమ్మా నేను కళ్యాణ్ రామ్ గారు కాదు.. మీ బిడ్డని మీరు ఎలాగైనా పిలవచ్చు అని చెప్పాడు. విజయశాంతి రియాక్ట్ అవుతూ హీరోకి ఇవ్వాల్సిన గౌరవం అది అని తెలిపింది. ఇంట్లో అయితే బిడ్డని బాబు అని పిలవచ్చు. బయట మాత్రం గౌరవం ఇవ్వాలి అని తెలిపింది. కళ్యాణ్ రామ్ మాత్రం తనకి తల్లి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సంభాషణ సరదాగా సాగింది.