బాలయ్యకి చెమటలు పట్టించాడు, కానీ చిరంజీవి అట్టర్ ఫ్లాప్ మూవీతో దెబ్బైపోయిన నాగార్జున

అక్కినేని నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మధ్య బాక్సాఫీస్ పోటీ చాలా కాలం కొనసాగింది. నాగార్జున చాలా చిత్రాలతో చిరంజీవి, బాలయ్య లకి గట్టి పోటీ ఇచ్చారు. 

Nagarjuna and Balakrishna

అక్కినేని నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మధ్య బాక్సాఫీస్ పోటీ చాలా కాలం కొనసాగింది. నాగార్జున చాలా చిత్రాలతో చిరంజీవి, బాలయ్య లకి గట్టి పోటీ ఇచ్చారు. ఈ క్రమంలో నాగార్జున ఇండస్ట్రీ హిట్ రికార్డుని కొన్ని సందర్భాల్లో కోల్పోయారు. ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

శివ చిత్రంతో నాగార్జున కెరీర్ పూర్తిగా మారిపోయింది. నాగార్జున తిరుగులేని స్టార్ హీరో అయింది ఈ చిత్రంతోనే. అంతకు ముందు నాగార్జునకి హిట్స్ లేవా అంటే ఉన్నాయి. ఏకంగా ఇండస్ట్రీ హిట్ రికార్డు దగ్గర వరకు వెళ్లిన చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ నాగార్జునకి సోలోగా గుర్తింపు వచ్చింది మాత్రం శివ చిత్రంతోనే. అంతకు ముందు నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఆఖరి పోరాటం చిత్రం ఉండేది. శ్రీదేవి, నాగార్జున జంటగా నటించిన ఈ చిత్రం రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కింది. 


వసూళ్ళ పరంగా ఈ చిత్రం సంచలనం సృష్టించింది. కానీ క్రెడిట్ మొత్తం శ్రీదేవికి వెళ్ళిపోయింది. ఇది శ్రీదేవి చిత్రం అని చాలా మంది కామెంట్ చేయడంతో నాగార్జున బాధపడ్డారట. అంతకు ముందు ఇండస్ట్రీ హిట్ గా ఉన్న చిరంజీవి పసివాడి ప్రాణం చిత్ర రికార్డులకు చేరువగా వెళ్ళింది ఆఖరి పోరాటం. కానీ ఇండస్ట్రీ హిట్ కాలేకపోయింది. 

megastar chiranjeevi

నాగార్జున మరోసారి ఇండస్ట్రీ హిట్ మిస్ చేసుకున్నారు. ఆ మూవీ హలో బ్రదర్. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నాగార్జున డ్యూయెల్ రోల్ లో నటించారు. 50 రోజుల్లోనే ఈ చిత్రం 6 కోట్లకి పైగా వసూళ్లు సాధించడంతో అంతా ఇండస్ట్రీ హిట్ ఖాయం అనుకున్నారు. కానీ ఆ టైంలో చిరంజీవి అట్టర్ ఫ్లాప్ మూవీ ఎస్పీ పరశురామ్ విడుదలయింది. ఈ చిత్రం కోసం హలో బ్రదర్ చిత్రాన్ని 20 కేంద్రాల్లో తొలగించారు. దీనితో భారీ మొత్తంలో రెవెన్యూ కోల్పోవాల్సి వచ్చింది. ఇండస్ట్రీ హిట్ కి దగ్గర్లో వెళ్లి ఆగిపోయింది. 

నాగార్జున నటించిన నువ్వొస్తావని మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ రికార్డుని మిస్ చేసుకుంది. నందమూరి బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి చిత్రం తిరుగులేని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ మూవీ రికార్డుని బద్దలు కొట్టడం అంత సులభం కాదని అంతా భావించారు. ఆ మరుసటి ఏడాది విడుదలైన నాగార్జున నువ్వొస్తావని చిత్రం ఒక రకంగా బాలయ్యకి చెమటలు పట్టించింది అని చెప్పొచ్చు. ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన నువ్వొస్తావని వసూళ్లు చూసి అంతా షాక్ అయ్యారు. ఇక సమరసింహారెడ్డి రికార్డులు బద్దలు కావడం ఖాయం అని అంతా అనుకున్నారు. 100 రోజుల తర్వాత కూడా ఈ మూవీ వసూళ్లు ఏమాత్రం తగ్గలేదు. కానీ అదే సమయంలో నాగార్జున నటించిన మరో చిత్రం నిన్నే ప్రేమిస్తా చిత్రం రిలీజ్ అయింది. ఈ మూవీ కోసం 35 సెంటర్స్ లో నువ్వొస్తావని చిత్రాన్ని తీసేశారు. ఫలితంగా నువ్వొస్తావని ఇండస్ట్రీ హిట్ కాకుండా ఆగిపోయింది. 

Latest Videos

click me!