వరుస మరణాలు, నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా ?.. ఒక్కొక్కరిని గుర్తు చేస్తూ చైతన్య కృష్ణ కామెంట్స్ 

Published : Dec 01, 2023, 03:58 PM IST

జరిగిన మరణాలు మాత్రం చాలా బాధాకరం.. ముఖ్యంగా తారక రత్న మరణించడం మేము ఇప్పటికీ జీర్ణించుకోలేకున్నాం. తారకరత్న రవ్వంత కూడా గర్వం లేని వ్యక్తి. ఫ్యామిలీ పేరు చెప్పుకుని ఎదగాలని ఏనాడూ అనుకోలేదు.

PREV
17
వరుస మరణాలు, నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా ?.. ఒక్కొక్కరిని గుర్తు చేస్తూ చైతన్య కృష్ణ కామెంట్స్ 

నందమూరి చైతన్య కృష్ణ తనని తానూ రీ లాంచ్ చేసుకుంటూ బ్రీత్ అనే థ్రిల్లర్ మూవీతో వచ్చేస్తున్నాడు. డిసెంబర్ 2న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.  ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ తనయుడే నందమూరి చైతన్య కృష్ణ. చైతన్య కృష్ణ గతంలో రెండు దశాబ్దాల క్రితమే టాలీవుడ్ లో నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ సమయంలో చైతన్య కృష్ణ సక్సెస్ కాలేదు.   

27

ఇప్పుడు చైతన్య కృష్ణ బ్రీత్ అనే థ్రిల్లర్ తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. వరుసగా మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. పాలిటిక్స్, సినిమాలు ఇలా అన్ని అంశాలపై మొహమాటం లేకుండా తన అభిప్రాయాలు చెబుతున్నాడు. 

37

నందమూరి ఫ్యామిలిలో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇదేమైనా శాపం లాంటిదా అని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించగా చైతన్య కృష్ణ సమాధానం ఇచ్చారు. శాపం అనే మాట వాడకుండా.. ప్రపంచంలో ఎన్నో ట్రాజడీలు జరుగుతున్నాయి. మా కుటుంబంలో జరగకూడదు అని లేదు కదా అని అన్నారు. 

47
Image: Twitter

జరిగిన మరణాలు మాత్రం చాలా బాధాకరం.. ముఖ్యంగా తారక రత్న మరణించడం మేము ఇప్పటికీ జీర్ణించుకోలేకున్నాం. తారకరత్న రవ్వంత కూడా గర్వం లేని వ్యక్తి. ఫ్యామిలీ పేరు చెప్పుకుని ఎదగాలని ఏనాడూ అనుకోలేదు. తాతగారి పేరుని ఎప్పుడూ పాడు చేయలేదు. తారకరత్నకు ఫస్ట్ కారు ఇచ్చింది నేనే. డ్రైవింగ్ కూడా నేర్పించా. 

57

ఎప్పుడు కలిసిన ఆ విషయాన్ని తారక రత్న నాతో గుర్తు చేసుకునేవాడు. అలాగే చిన్న తనంలో ప్రతి సండే మేము కలసి క్రికెట్ ఆడేవాళ్ళం. మాతో పాటు పక్కింది ముస్లిం స్నేహితులు కూడా క్రికెట్ ఆడవాళ్లు. తారకరత్న చాలా బాగా చదువుకున్నాడు. తారకరత్నని మేము ఓబులేశు అనే పిలిచేవాళ్ళం అని చైతన్య తెలిపారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తున్న సమయంలో తారకరత్న గుండెపోటుకి గురికావడం దాదాపు మూడు నాలుగు వారాలు ఆసుపత్రిలో చికిత్సా తీసుకుంటూ మరణించడం తెలిసిన సంగతే. 

67

ఇక చైతన్య కృష్ణ.. నందమూరి జానకిరామ్ గురించి కూడా మాట్లాడారు. హరికృష్ణ పెద్ద కుమారుడే జానకిరామ్. రోడ్డు ప్రమాదంలో జానకిరామ్ మరణించారు. చైతన్య కృష్ణ మాట్లాడుతూ.. జానకిరామ్ రామారావు గారి మనవడు అంటే ఫ్రెండ్స్ ఎవ్వరూ నమ్మేవారు కాదు. చాలా సింపుల్ గా ఉండేవారు. ఆయనకి కూడా ఏమాత్రం గర్వం లేదు. 

77

ఏది ఏమైనా తారకరత్న, జానకిరామ్, హరికృష్ణ బాబాయ్ కి ఆ విధంగా జరగడం బాధాకరం. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ జీర్ణించుకోలేకపోయాం అని తెలిపారు. జీవితం కాబట్టి ఇలాంటివి ఫేస్ చేయాల్సిందే. నందమూరి ఫ్యామిలిలో ఈ తరంలో తానే పెద్దవాడిని అనుకుంటారని కానీ అదినిజం కాదని చైతన్య కృష్ణ అన్నారు. నాకంటే ముద్దు మా అక్క కుమ్ముదిని జన్మించారు. ఆమె చాలా కాలం క్రితమే 2000లో మరణించినట్లు చైతన్య కృష్ణ తెలిపారు. 

click me!

Recommended Stories