Megastar Chiranjeevi : విశ్వంభరలో ఊహించని గెటప్ లో చిరంజీవి.. 200 కోట్ల బడ్జెట్ తో ప్రయోగాలా ?

First Published | Feb 27, 2024, 11:33 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజువల్ వండర్ గా రూపొందుతోంది. 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజువల్ వండర్ గా రూపొందుతోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత మెగాస్టార్ ఆ తరహా ఫాంటసీ జోనర్ లో నటిస్తున్న చిత్రం ఇదే. ముల్లోకాలు చుట్టూ ఈ కథ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ చిత్రంలో వీరుడిగా నటించే చిరంజీవి ఏ లక్ష్యం కోసం పోరాడబోతున్నాడు, ఈ చిత్ర కథలోని కీలక అంశం ఏంటి అనేది ఇప్పటికీ సస్పెన్స్. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా ఎంపికైంది. ఇప్పటికే విశ్వంభర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సురభి, ఇషా చావ్లా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 


అయితే విశ్వంభర చిత్రం నుంచి అందుతున్న ఒక్కో లీక్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలో చిరంజీవి గెటప్ గురించి మైండ్ బ్లోయింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి ట్విన్ బ్రదర్స్ గా నటించబోతున్నట్లు ఒక గాసిప్ ఉంది. దీనికి తోడు మరో గాసిప్ కూడా ఉత్కంఠ పెంచేస్తోంది. 

ఈ మూవీలో ఒక పాత్ర కోసం చిరు 70 ఏళ్ళు పైబడిన వృద్దుడిగా కనిపించబోతున్నారట.  ఈ పాత్ర సినిమాలో చాలా కీలకం కానున్నట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి 70 వృద్దుడిగా కనిపించాలంటే బలమైన కారణం ఉండాలి. లేదని ఫ్యాన్స్ కి ఆ పాత్ర మింగుడు పడడం కష్టం. అయితే ఆ పాత్రతో ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచేలా దర్శకుడు వశిష్ట అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఎలాంటి అంచనాలు లేకుండాఆ బింబిసార తో మ్యాజిక్ చేసి చూపించిన వసిష్ఠ.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిత్రాన్ని ఏ విధంగా తీర్చి దిద్దుతారో చూడాలి. 

కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత భోళా శంకర్ లాంటి డిజాస్టర్ ఎదురైంది. దీనిని మెగా అభిమానులు మరచిపోవాలంటే విశ్వంభర చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. 2025 సంక్రాంతికి విశ్వంభర రిలీజ్ కానుంది. 

Latest Videos

click me!