సాయి ధరమ్ తేజ్ మూవీ కోసం 12 ఎకరాల్లో భారీ సెట్.. డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారే

First Published | Sep 21, 2024, 5:15 PM IST

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తన కెరీర్ లో మునుపటి జోష్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత తేజు.. విరూపాక్ష, బ్రో చిత్రాల్లో నటించారు.

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తన కెరీర్ లో మునుపటి జోష్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత తేజు.. విరూపాక్ష, బ్రో చిత్రాల్లో నటించారు. విరూపాక్ష సూపర్ హిట్ గా నిలిచింది. బ్రో మాత్రం నిరాశపరిచింది. 

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్.. రోహిత్ కెపి అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే మాసివ్ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు 80 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని టాక్. 


వైవిధ్యమైన యాక్షన్ డ్రామాగా తెరకెక్కే ఈ చిత్రం కోసం నిర్మాతలు తేజు మార్కెట్ కి మించి ఖర్చు చేస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ పూర్తయింది. 15 రోజుల పాటు దర్శకుడు సాయిధరమ్ తేజ్ పై భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారట. 

నెక్స్ట్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో భారీ సెట్ నిర్మించారట. అబ్బురపరిచేలా సెట్ ఉంటుందని టాక్. ఈ చిత్రానికి నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. చూస్తుంటే వీళ్ళు తెచ్చు చిత్రం కోసం డబ్బుని మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ఈ సెట్ లో మరో లాంగ్ షెడ్యూల్ ఉంటుందట. ఈ చిత్రంలో తేజుకి జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. 

Latest Videos

click me!