నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలయ్య ఇతర సీనియర్ల కంటే ముందంజలో ఉన్నారు. అది ఎలాగో ఈ కథనంలో తెలుసుకోండి.
నందమూరి బాలకృష్ణ లేటు వయసులో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2పై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. అఖండ 2 చిత్రం హిందీలో కూడా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంతో బాలయ్య పాన్ ఇండియా మార్కెట్ పై కూడా కన్నేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్లంతా వెనుకబడి ఉన్నారు. బాలయ్య మాత్రం హిట్ల మీద హిట్లు కొడుతున్నారు.
25
అఖండ 2 హిట్టయితే..
బాలకృష్ణ నటించిన చివరి నాలుగు చిత్రాలు విజయాలే. ఇంత కన్సిస్టెంట్ గా బాలయ్య కెరీర్ ఎప్పుడూ లేదు. అఖండ 2 కనుక విజయం సాధిస్తే బాలయ్య మార్కెట్ నెక్స్ట్ లెవల్ కి వెళ్లిపోవడం ఖాయం. యువ హీరోల ప్రభావం పెరిగినప్పుడు సీనియర్ల జోరు తగ్గడం సహజమే. అందుకే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ల జోరు కాస్త తగ్గింది. వేళ్ళు అప్పుడప్పుడూ హిట్లు కొడుతున్నారు కానీ కన్సిస్టెన్సీ మైంటైన్ చేయడం లేదు.
35
ఆ ముగ్గురి కంటే ముందంజలో బాలయ్య
కానీ వీరి ముగ్గురు కంటే బాలయ్య ముందంజలో ఉన్నారు. గతంలో బాలయ్య రొటీన్ మాస్ సినిమాలు చేస్తూ వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నారు. ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కంటే బాలయ్య ఎలా వరుస హిట్లు అందుకుంటున్నారు అనే చర్చ మొదలైంది.
బాలయ్య ఇప్పుడు కూడా చేస్తున్నది మాస్ సినిమాలే. ఈ చిత్రాల్లో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటున్నాయి. కానీ వాటిని పక్కాగా ఉండేలా, అభిమానులకు నచ్చేలా బాలయ్య చూసుకుంటున్నారు. బాలయ్యకు ప్రధాన బలం ఏంటంటే.. రీమేక్ ల జోలికి వెళ్లడం లేదు. చిరంజీవి చివరి నాలుగు చిత్రాల్లో 2 రీమేక్ లు ఉన్నాయి. గాడ్ ఫాదర్, భోళా శంకర్ రెండు చిత్రాలు రీమేక్ లే. అవి పూర్తిగా నిరాశ పరిచాయి.
55
తడబడుతున్న సీనియర్లు
వెంకటేష్ చివరగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో భారీ హిట్ అందుకున్నారు. అంతకు ముందు తన ఇమేజ్ కి ఏమాత్రం సెట్ కాని సైంధవ్ మూవీతో భారీ ఫ్లాప్ మూటగట్టుకున్నారు. నాగార్జున అయితే హీరోగా కనిపించి చాలా కాలం అవుతోంది. ఇటీవల నాగార్జునకి సరైన హిట్ లేదు. సీనియర్లు తడబడుతున్న సమయంలో బాలయ్య ఒక్కడే దూసుకుపోతున్నాడు.