అందుకే నా సినిమా అట్టర్ ఫ్లాప్, టైటిలే పెద్ద తేడా.. అల్లు హీరోతో ఓపెన్ గా చెప్పిన బాలయ్య

First Published | Sep 22, 2024, 11:35 AM IST

బాలకృష్ణకి, అల్లు ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ అతిథిగా హాజరయ్యారు. అల్లు అరవింద్ కి చెందిన ఆహాలోనే బాలయ్య అన్ స్టాపబుల్ షో చేస్తున్నారు. 

నందమూరి బాలకృష్ణ పబ్లిక్ గా తన కోపాన్ని, ఫన్నీ యాంగిల్ ని చూపిస్తుంటారు. వేదికలపై జోకులు వేస్తూ నవ్విస్తుంటారు. అన్ స్టాపబుల్ లాంటి షోలో బాలయ్య కామెడీ టైమింగ్, ఎనెర్జీ హైలైట్ గా నిలుస్తోంది. ఎలాంటి విషయం గురించి అయినా బాలయ్య ముక్కుసూటిగా మాట్లాడతారు అనే విషయం అందరికి తెలిసిందే. 

బాలకృష్ణకి, అల్లు ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ అతిథిగా హాజరయ్యారు. అల్లు అరవింద్ కి చెందిన ఆహాలోనే బాలయ్య అన్ స్టాపబుల్ షో చేస్తున్నారు. అంతే కాదు బాలయ్య, అల్లు ఫ్యామిలీ తరచుగా కలుసుకుంటున్నారు. 


Also Read : నాగ చైతన్య అన్నీ వదిలేసుకున్నాడు.. నాగార్జున కొడుకుని అనే విషయాన్ని పక్కన పెట్టేశాడు


ఒక ఈవెంట్ లో అల్లు హీరో అల్లు శిరీష్, నందమూరి బాలకృష్ణ మధ్య సరదా సంభాషణ జరిగింది. అల్లు శిరీష్ బాలయ్య వద్దకి వచ్చి.. సార్ సింహా అనే టైటిల్ తో మీ సినిమాలు చాలా ఫేమస్ అయ్యాయి. చాలా హిట్లు కూడా ఉన్నాయి. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహ,  జైసింహా,, సింహా, అదే విధంగా వీర సింహారెడ్డి చిత్రాలు సింహా టైటిల్ తో ఉన్నాయి. 

ఇవి కాకుండా మీరు నటించిన మరో చిత్రం కూడా సింహా టైటిల్ తో ఉంది. ఆ మూవీ ఏంటి చెప్పండి అని అల్లు శిరీష్ ప్రశ్నించారు. బాలయ్య వెంటనే బొబ్బిలి సింహం ఉంది కదా అని అన్నారు. ఓకె..బొబ్బిలి సింహం కూడా కాకుండా మరో మూవీ ఉంది అని శిరీష్ అడిగాడు. దీనితో ఆ మూవీ గుర్తు రాక బాలయ్య ఇరకాటంలో పడ్డారు. 

అల్లు శిరీష్ ఈ ప్రశ్నకి సమాధానం ఇస్తూ.. 'సింహం నవ్వింది' సార్ అని చెప్పారు. బాలయ్య వెంటనే అందుకే ఆ సినిమా పోయింది అంటూ ఓపెన్ గా చెప్పేశారు. దీనితో అక్కడున్న వాళ్లంతా నవ్వారు. సింహం నవ్వడం ఏంటి..టైటిలే కరెక్ట్ కాదు.. అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయింది అని బాలయ్య తెలిపారు. సింహం నవ్వింది చిత్రంలో బాలయ్య, తన తండ్రి ఎన్టీఆర్ తో కలసి నటించారు. 1983లో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. 

Latest Videos

click me!