ఇంద్ర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత డైరెక్టర్ బి గోపాల్ బాలయ్యతో సినిమా చేశారు. కానీ ఆ చిత్రం దారుణంగా ట్రోల్ అయింది. ఆ మూవీపై నటుడు, రచయిత పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో బాగా ట్రోల్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పలనాటి బ్రహ్మనాయుడు. ఈ చిత్రానికి మాస్ చిత్రాల దర్శకుడు బి గోపాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కథ అందించింది పోసాని కృష్ణ మురళి. సంభాషణలు రచించింది పరుచూరి బ్రదర్స్.
25
ఇంద్ర టీమ్ రిపీట్
ఈ చిత్రానికి హీరో తప్ప ఇంద్ర మూవీకి పనిచేసిన వాళ్లే ఎక్కువగా రిపీట్ అయ్యారు. ఇంద్ర తర్వాత బి గోపాల్ వెంటనే చేసిన చిత్రం ఇది. పరుచూరి బ్రదర్స్ ఎలాగూ ఉన్నారు. ఇంద్రలో నటించిన సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ ఈ మూవీలో కూడా నటించారు. ఇంద్రకి సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ పలనాటి బ్రహ్మనాయుడు చిత్రానికి కూడా సంగీతం అందించారు.
35
ట్రోల్ మెటీరియల్ గా మారిన సినిమా
ఇలా ఎక్కువగా ఇంద్ర టీమ్ రిపీట్ కావడంతో ఆ సినిమా రికార్డులని బద్దలు కొడుతుంది అని అంతా భావించారు. కానీ రికార్డుల సంగతి పక్కన పెడితే పలనాటి బ్రహ్మనాయుడు చిత్రం కనీసం ఆకట్టుకోలేకపోయింది. పైగా బాలయ్య కెరీర్ లో అతి పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మారింది. పోసాని కృష్ణ మురళి ఎక్కువగా కుటుంబ కథలు రాస్తుంటారు. తన శైలికి భిన్నంగా ఈ చిత్రానికి ఒక మాస్ కథ ఇచ్చారు. అది పూర్తిగా బెడిసికొట్టింది.
ఓ ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ పలనాటి బ్రహ్మనాయుడు మూవీ గురించి ఇప్పుడు మాట్లాడకపోవడమే బెటర్. ఆ సినిమా ఫ్లాప్ కి కారణం ఎవరనే చర్చ ఇప్పుడు అనవసరం. తొడ కొడితే ట్రైన్ రివర్స్ వెళ్లే సన్నివేశంపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. అది ఒక పరమ చెత్త కథ. ఆ సినిమా ఫ్లాప్ కి నేనే బాధ్యత వహిస్తా. ఎవరిమీదో ఎందుకు చెప్పాలి. నేనే కారణం అని చెప్పుకుంటా అంటూ పోసాని కామెంట్స్ చేశారు.
55
హీరోయిన్లు రివర్స్
అప్పటి వరకు రాయలసీమ ఫ్యాక్షన్ చిత్రాల ట్రెండ్ నడిచింది. మళ్ళీ అదే బ్యాక్ డ్రాప్ ఎందుకునుకున్నారో ఏమో.. కథని పలనాడు బ్యాక్ డ్రాప్ కి మార్చారు. ఇంద్ర హీరోయిన్లని రిపీట్ చేశారు అనే మాట రాకుండా వారి పాత్రలని జస్ట్ రివర్స్ చేశారు. ఇంద్రలో సోనాలి పాజిటివ్ రోల్ లో నటించింది. ఇందులో ఆమెది నెగిటివ్ రోల్. ఇంద్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఆర్తి అగర్వాల్ ఈ మూవీలో పాజిటివ్ రోల్ లో కనిపించింది.