అయితే సక్సెస్ పార్టీలో హై జోష్ లో కనిపించిన బాలయ్య ఊర్వశితో ప్రవర్తించిన విధానానికి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఊర్వశితో కలసి దబిడి దిబిడి హుక్ స్టెప్పు ని రీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు హుక్ స్టెప్పు వల్గర్ గా ఉందని ట్రోలింగ్ జరిగింది. పార్టీలో అందరి ముందు బాలయ్య తనతో దబిడి దిబిడి హుక్ స్టెప్పు వేసే ప్రయత్నం చేయడంతో ఊర్వశి ఇబ్బంది పడుతూ కనిపించింది. దీనితో నెటిజన్లు మరోసారి బాలయ్యపై ట్రోలింగ్ తో విరుచుకుపడుతున్నారు.