ఈ వివాదంపై అన్షు ఎట్టకేలకు స్పందించింది. ఈ ప్రపంచంలో త్రినాధరావు గారు చాలా మంచి వ్యక్తి. ఆయన దర్శకత్వంలో నేను రీ ఎంట్రీ ఇస్తున్నందుకు సంతోషిస్తున్నా. ఆయనపై నాకు ఎలాంటి కోపం లేదు. నన్ను ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకున్నారు. ఆయన సూచనలు, సలహాకు నాకు ఉపయోగపడ్డాయి. దయచేసి ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టండి అని అన్షు కోరింది.