Published : Jul 21, 2026, 03:24 PM ISTUpdated : Jul 21, 2026, 03:27 PM IST
Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణకు గాయాలు అయ్యాయి, షూటింగ్ లో ఓ ప్రమాదంలో ఆయనకు దెబ్బలు తగిలినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది? ప్రస్తుతం బాలయ్యకు ఎలా ఉంది?
నటసింహం నందమూరి బాలకృష్ణ అంటేనే గుర్తొచ్చేది.. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ డైలాగ్స్.. ఒళ్లు గగుర్పొడిచే రోమాంచిత పోరాటాలు. ఆరు పదుల వయసు దాటినా కూడా డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేయడానికి ఆయన ఎప్పుడూ వెనుకాడరు. అయితే, ఈ సాహసాలే కొన్నిసార్లు ఆయనకు గాయాలయ్యేందుకు కారణమవుతున్నాయి. తాజాగా మరోసారి బాలయ్య గాయాలపాలు అయినట్టు తెలుస్తోంది.
24
షూటింగ్ లొకేషన్‌లో అసలేం జరిగింది?
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 111వ చిత్రం (#NBK111) షూటింగ్ బిజీలో బాలకృష్ణ ఉన్నారు. కాకినాడ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక ప్రమాదం చోటుచేసుకుంది. నటుడు మంచు మనోజ్‌తో కలిసి ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తుండగా బాలకృష్ణ కాలు జారడం లేదా మెలిక పడటంతో కిందపడిపోయారు. దీనివల్ల ఆయన మోకాలి భాగంలో దెబ్బతగిలి నొప్పితో బాధపడ్డారు.
34
ఆందోళనలో అభిమానుల, డాక్టర్లు ఏమంటున్నారంటే?
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన మూవీ టీమ్ చిత్రీకరణను నిలిపివేసి, ఆయనను తక్షణమే సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, అవసరమైన స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు.ఈ ఘటనపై వైద్య బృందం స్పందిస్తూ — పూర్తిగా - త్వరగా కోలుకునేందుకు బాలకృష్ణకు చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారు. ఈ చికిత్స ఆయన త్వరగా కోలుకోవడానికి, దీర్ఘకాలిక సమస్యలేవీ లేకుండా తిరిగి షూటింగ్‌లో పాల్గొనడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు.
బాలకృష్ణకు యాక్షన్ సీన్స్‌లో గాయపడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో 'అఖండ' సినిమా చిత్రీకరణ సమయంలోనూ ఆయన ఎడమ భుజం కండరాల గాయంతో (Rotator cuff tear) బాధపడ్డారు. తీవ్రమైన నొప్పితోనే.. చేతికి బ్యాండ్ వేసుకుని టాక్ షోలు, షూటింగ్‌లలో పాల్గొన్నప్పటికీ, ఆ తర్వాత హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో నాలుగు గంటల పాటు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్నారు.