రేటుపెంచిన బాలయ్య.. సినిమాలతో పాటు రాజకీయల్లో హ్యాట్రిక్‌ .. అఖండ‌-2 కి బాలకృష్ణ ఎంత తీసుకుంటున్నాడంటే..?

First Published | Jun 12, 2024, 11:09 AM IST

ఇటుసినిమాలు.. అటు రాజకీయాలు.. రెండు రంగాల్లో విజయాలతో దూసుకుపోతున్నాడు నందమూరి నట సింహం బాలయ్య బాబు. తాజాగా ఆయన రెమ్యూనరేషన్ పెంచినట్టు తెలుస్తోంది. అందులో నిజంఎంత..? 
 

Balakrishna

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నందమూరినటసింహం బాలయ్య. సినిమాల పరంగా ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టి చూపించిన బలయ్య.. అటు రాజకీయాల్లో కూడా హ్యాట్రిక్ సక్సెస్ తో దూసుకుపోయాడు. హిందూపురం నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలయ్య బాబు. ఈక్రమంలో ఆయన నెక్ట్స్ సినిమాలపై దృష్టి గట్టిపెట్టబోతున్నాడు. ఇక బాలయ్య కుసబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వూరల్ అవుతోంది. 

బాలయ్య  ప్రస్తుతం బాబీ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా తరువాత ఆయన  బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూవీ ప్లాన్ చేశారు. ఈ ఇద్దరి కాంబో బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ గా పేరుంది. ఇక  ఈ కాంబినేషన్ లో గతంలో  తెరకెకిన అఖండ ఎంతటి సక్సెస్ సాధించింతో తెలిసిందే. ఇక ఈమూవీకి సీక్వెల్ గా మరో సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇక ఈ  సీక్వెల్ పై ఏ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 


akhanda hindi release after one year ticket offer nandamuri balakrishna

14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంటఈ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల రూపాయలు పెట్టబోతున్నారట. ఇక మరో విషయం ఏంటంటే.. ఈసినిమాతో బాలయ్య కూడా రెమ్యూనరేషన్ కూడా గట్టిగా పెంచేసినట్టు సమాచారం. ఇంతకీ అఖండ 2కి ఆయన ఎంత పారితోషికం తీసుకోబోతున్నారో తెలుసా..? 

akhanda hindi version to hit theatres on january 20 Nandamuri Balakrishna

ఒకవైపు బాలయ్య మరోవైపు బోయపాటి శ్రీను ఈ సినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. బాలయ్య ఈ సినిమా కొరకు ఏకంగా 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. బాబీ  సినిమాకు 30 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్న ఆ మొత్తాన్ని 40 కోట్ల రూపాయలకు పెంచడం హాట్ టాపిక్ అవుతోంది.

వరుస హిట్లు పడటంతో  బాలయ్య  మళ్లీ పారితోషికాన్ని పెంచేశారట. సక్సెస్ రేటు ఎకే్కువగా ఉండటంతో అటు నిర్మాతలు కూడా బాలయ్యకు కాదనకుండా ఇచ్చేస్తున్నారట.  ఈ మధ్య కాలంలో బాలయ్య సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాయి. అఖండ2 సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. బోయపాటి శ్రీను తన ప్లాప్ లను దృష్టిలో పెట్టుకుని ఈసినిమా విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఫిక్స్ అయ్యారట. 

Latest Videos

click me!