బాత్‌ రూమ్‌ కోసం గంటల తరబడి వెయిటింగ్‌.. అబ్బో అది నరకం.. శ్రీ చైతన్య కాలేజీ బాగోతం బయటపెట్టిన హీరోయిన్‌

First Published Jun 12, 2024, 10:06 AM IST

తెలుగు హీరోయిన్‌ చాందిని చౌదరి కాలేజ్‌ టైమ్‌లో పడ్డ ఇబ్బందులు బయటపెట్టింది. బాత్‌ రూమ్‌కోసం గంటల తరబడి వెయిట్ చేశానని, అదో నరకమని చెప్పింది చాందిని. 
 

చాందిని చౌదరి షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. పదేళ్ల క్రితమే ఆమె షార్ట్ ఫిల్మ్స్ తో పాపులర్‌ అయ్యింది. అదే ఆమెకి సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది. `మధురం` అనే లఘు చిత్రం ఛాందినిని పాపులర్‌ చేసింది. ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన దర్శకుడు ముళ్లపూడి వర, కె రాఘవేంద్రరావు చాందినికి `కుందనపు బొమ్మ` చిత్రంలో ఆఫర్‌ ఇచ్చారు. 
 

అయితే అప్పటికే చాందిని రెండు మూడు సినిమాలు చేసింది. `లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌`లో చిన్న పాత్రలో మెరిసింది. `కేటుగాడు` మూవీలో హీరోయిన్‌గానే నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో ముళ్లపూడి వర తీసిన `కుందనపు బొమ్మ`లో ఎంపికైంది. ఎన్నో ఆశలు, అంచనాలతో వచ్చిన ఈ చిత్రం కూడా ఆదరణ పొందలేదు. 
 

ఇలా `బ్రహ్మోత్సవం`, `శమంతకమణి`, `లై`, `హౌరా బ్రిజ్జ్`, `మను` చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. నటిగా ఆకట్టుకుంటున్నా, సరైన బ్రేక్‌ రాలేదు. కుర్ర హీరో సుహాస్‌తో కలిసి `కలర్‌ ఫోటో` చిత్రంలో మెరిసింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. కానీ మంచి ఆదరణ పొందింది. ఏకంగా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డుని అందుకుంది. దీంతో చాందికి మంచి బ్రేక్‌ వచ్చింది. ఆ తర్వాత చాందిని ఎంచుకుంటున్న సినిమాల తీరు మారింది. కంటెంట్‌ ఉన్న చిత్రాలతో, బలమైన పాత్రలతో అలరిస్తుంది. 
 

అందులో భాగంగా ప్రస్తుతం ఆమె `యేవమ్‌` అనే సినిమాలో మెయిన్‌లీడ్‌గా చేస్తుంది. పోలీస్‌ ఆఫీసర్‌గా మెరవబోతుంది. ప్రకాష్‌ దంతలూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవదీప్‌ నిర్మించడం విశేషం. ఈ శుక్రవారం(జూన్‌ 14)న ఈ చిత్రం విడుదల కాబోతుంది. అయితే తాజాగా చాందిని చౌదరి `దావత్‌` టాక్‌ షోలో పాల్గొంది. సోషల్‌ మీడియా సెన్సేషన్‌ రీతూ చౌదరి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ఇది. ఇందులో బోల్డ్ గా మాట్లాడుతూ ఆకట్టుకుంటుంటారు. 
 

అందులో భాగంగా చాందిని చౌదరి తాను ఇంటర్మీడియట్‌ లో చేసిన తప్పుని వెల్లడించింది. ఈ క్రమంలో శ్రీ చైతన్య కాలేజీ బాగోతం బయటపెట్టింది. అందులో ఉన్నప్పుడు ఎంత నరకం అనుభవించిందో చెప్పింది చాందిని. బాగా చదవాలని, దుమ్ములేపాలని విజయవాడలోని శ్రీ చైతన్య కాలేజీలో చేరిందట. కానీ ఆ హాస్టల్‌కి వెళ్లాక తెలిసింది అసలు నరకం అంటే ఏంటో, అందరికి కంబైన్డ్ బాత్‌రూమ్‌లు ఉంటాయట. బాత్‌ రూమ్‌కి వెళ్లాలంటే మార్నింగ్ గంటన్నర ముందు లేచి బకెట్లు పట్టుకుని లైన్‌లో గంటల తరబడి వెయిట్‌ చేయాలట. 
 

మార్నింగ్‌ ఆరు గంటలకే క్లాస్‌లు స్టార్ట్ అవుతాయట. ఫుడ్‌ ఉండదు, ఏముండదు, రెండు క్లాస్‌ లు అవుతాయి, అవి అయ్యాక వెళ్లి స్నానం చేసి పడుకోవడం, రోజూ మూడు నాలుగు గంటలు మాత్రమే నిద్ర. అబ్బో అదో నరకం అందుకే మూడు నెలల్లోనే ఇంటికి తిరిగొచ్చాను అని తెలిపింది చాందిని చౌదరి. 
 

ఇక పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు అవన్నీ కుదరాలి అని, లవ్‌ మ్యారేజ్‌ అయినా, అరెంజ్‌ మ్యారేజ్‌ అయినా ఓకే అని చెప్పింది. ఇక నవదీప్‌, నవీన్‌ చంద్రలో ఎవరు ఇష్టమని అడగ్గా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పిన చాందిని.. ఇద్దరి ఫోన్లు ఒకేసారి వస్తే ఎవరి ఫోన్‌ లిఫ్ట్ చేస్తారంటే నవీన్‌ది అని చెప్పి ట్విస్ట్ ఇచ్చింది. 
 

Latest Videos

click me!