' మిమ్మల్ని తిట్టిన వాళ్లంతా ఓడిపోయారు' కి రజనీ అదిరిపోయే రిప్లై, రోజాకి స్ట్రాంగ్‌ కౌంటర్‌.. పవన్‌పై కామెంట్

First Published Jun 12, 2024, 9:39 AM IST

ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. చంద్రబాబు మళ్లీ అధికారం చేజిక్కించుకున్నారు. ఈ నేపధ్యంలో రజనీకాంత్ ..

Pawan kalyan, rajanikanth

లాస్ట్ ఇయిర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు సూపర్ స్టార్ రజనీకాంత్  ని ముఖ్య అతిథిగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా జరిగిన వేడుకలో రజని మాట్లాడుతూ చంద్రబాబునాయుడు దార్శనికతను, విజన్ 2020, హైటెక్ సిటీని ప్రస్తావించి పొగడ్తల వర్షం కురిపించారు. ఇది  అప్పుడు అధికారంలో ఉన్న వైసిపి నేతలకు నచ్చలేదు. పక్క రాష్ట్రం హీరో అనే కనీస విచక్షణ లేకుండా మాటల దాడి చేశారు. కొడాలి నాని కాస్త గట్టిగానే నోటికి వచ్చినట్లు మాట్లాడారు. రోజా ఏకంగా తమిళంలోనే విమర్శలు చేసింది. అవన్నీ అభిమానులకు ఆగ్రహం కలిగించింది. అయితే ఎవరూ ఏమీ చేయలని పరిస్దితి. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. చంద్రబాబు మళ్లీ అధికారం చేజిక్కించుకున్నారు. ఈ నేపధ్యంలో రజనీకాంత్ ..ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆ విషయాలపై రజనీ స్పందించారు.  వివరాల్లోకి వెళితే...

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ , తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంచి స్నేహితులు. ఎన్నో సంవత్సరాల నుంచి వారిద్దరి స్నేహం కొనసాగుతోంది. రజినీకాంత్ ఎప్పుడూ చంద్రబాబు పరిపాలనని ప్రశంసిస్తూ వుంటారు. అలాగే అప్పట్లో విజయవాడ వచ్చిన రజినీకాంత్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు, అలాగే ఆ తరువాత చంద్రబాబు గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు కూడా..అది వైసిపి వారికి నచ్చలేదు.

 రజినీకాంత్ ఒక స్టార్ హీరో, తనకన్నా సీనియర్ నటుడు, సహచర నటుడు అని చూడకుండా వైసీపీ ఎంఎల్ఏ రోజా ఘాటుగా విమర్శించారు. రజినీకాంత్ కి ఆంధ్ర పాలిటిక్స్ ఏం తెలుసనీ, రజినీకాంత్ పై ఇష్టానుసారంగా విమర్శలు చేశారు రోజా. ఆమెతో పాటు విమర్శలకు దిగారు వైసీపీ ఎమ్మల్యే కొడాలి నాని.

తరువాత ఒక సినిమా ఫంక్షన్ లో రజినీకాంత్ ఇలాంటివాళ్లనే ఉద్దేశించి మాట్లాడుతూ, ‘మొరగని కుక్క ఉండదు, విమర్శించని నోరు ఉండదు, ఈ రెండూ లేని ఊరు ఉండదు, అయినా మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. అర్థమైందా రాజా’, అని చెప్పారు. రజినీకాంత్ మాటలు అప్పుడు వైరల్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ అదే టాపిక్ వచ్చింది.   ఈ క్రమంలో ‘సార్‌..మిమ్మల్ని గతంలో తిట్టిన వైకాపా మంత్రులంతా ఓడిపోయారు’ అని ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌కు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చెప్పారు.
 

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వస్తున్న  రజనీకాంత్‌ దిల్లీ విమానాశ్రయంలో ఉండగా.. అక్కడికొచ్చిన బాలశౌరి గతంలో ఉన్న పరిచయంతో ఆయనను  పలకరించారు. ఈ సందర్భంగా బాలశౌరి వివిధ అంశాలపై మాట్లాడుతూ ‘గతంలో మీరు చంద్రబాబును పొగిడినప్పుడు వైకాపా మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో వారంతా ఓడిపోయారు’ అని వివరించారు.   
 

దీంతో రజనీకాంత్‌ చిరునవ్వుతో.. స్పందిస్తూ...‘మనకు నచ్చింది మనం మాట్లాడతాం.. దానికే తిడితే ఎలా? అలా తిట్టకూడదు కదా?’ అని పేర్కొన్నారు. ‘జనసేనలో చేరి మంచి పనిచేశారు. పవన్‌ కల్యాణ్‌ మంచి నాయకుడు అవుతారు’ అని ప్రశంసించారు. 
 

అప్పట్లో  రజనీకాంత్  చంద్రబాబును ప్రశంసిస్తూ ...‘చంద్రబాబు ఒక దీర్ఘదర్శి.. ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులే ఈ విషయం చెబుతున్నారు. చంద్రబాబు ఘనత ఏమిటో బయట వాళ్లకు బాగా తెలుసు’ అని కొనియాడారు. చంద్రబాబును పొగడటాన్ని తట్టుకోలేని అప్పటి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, రోజా తదితరులు రజనీకాంత్‌పై విరుచుకుపడ్డారు. నీచాతినీచమైన వ్యక్తుల్లో రజనీకాంత్‌ ఒకరని కొడాలి నాని విమర్శించారు. రజనీకాంత్‌కు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై అవగాహన లేకుండా మాట్లాడారని రోజా ధ్వజమెత్తారు. ఎన్నికల్లో వారంతా ఓటమిపాలయ్యారని రజనీకాంత్‌తో బాలశౌరి చెప్పారు. 
 

 చంద్రబాబునాయుడు అమోఘ విజయం సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు. సరికొత్త రికార్డు సృష్టించారు. ఎవరైతే బాబుని పొగిడినందుకే రజని మీద విరుచుకుపడ్డారో సదరు మంత్రులు, ఎమ్మెల్యేలు దారుణంగా ఓటమి పాలయ్యారు. కొన్ని రౌండ్లు పూర్తి కావడం ఆలస్యం కౌంటింగ్ సెంటర్ నుంచి పలాయనం సాగించారు. మౌనంగా ఉంటే పోయేదానికి అనవసరంగా తమిళ ఫ్యాన్స్ తో మాటలు పడటం ఇప్పుడు మరోసారి ఆ వ్యవహారాన్ని గుర్తుకు వచ్చేలా చేసింది. 
 

Latest Videos

click me!