హీరోగా కాదు.. బాలయ్య గెస్ట్ రోల్ చేసిన సినిమా ఏదో తెలుసా.? డైరెక్టర్ ఎవరంటే.!

Published : Jan 12, 2026, 09:00 AM IST

Balakrishna: నందమూరి బాలకృష్ణ హీరోగానే కాకుండా ఓ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. అందులో హీరోగా ఎవరు చేశారో తెలుసా.? బాలయ్య ఒకరే కాదు.. పలువురు స్టార్ హీరోలు సైతం అందులో కనిపించారు. మరి ఆ సినిమా ఏంటంటే.? 

PREV
15
నో రీమేక్.. ఓన్లీ మెయిన్ లీడ్..

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీమేక్ సినిమాల హవా కొనసాగుతోంది. పలువురు హీరోలు ఇతర భాషల్లో సక్సెస్ సాధించిన సినిమాలను రీమేక్‌లు చేసి హిట్ కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే నందమూరి బాలకృష్ణ మాత్రం ఇలాంటి సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. రీమేక్ సినిమాల్లో నటించేందుకు అస్సలు ఇష్టపడరు. స్ట్రెయిట్ తెలుగు సినిమాలే.. అదీ లీడ్ రోల్స్.. అయితే బాలయ్య కూడా ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేశారు.

25
బాలయ్య గెస్ట్ రోల్..

సాధారణంగా తన కెరీర్‌లో మెయిన్ లీడ్‌గా చిత్రాలు చేయడమే తప్ప.. బాలకృష్ణ ఎప్పుడూ కూడా ఏ సినిమాలోనూ.. అదీనూ రీమేక్ సినిమాల్లోనూ గెస్ట్ రోల్స్ అస్సలు చేయరు. అయితే ఆయన కెరీర్‌లో సోలో సినిమాలు కాకుండా ఓ గెస్ట్ రోల్ చేసిన సినిమా ఒకటి ఉంది. అది కూడా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు.

35
హీరోగా వెంకటేష్.. డైరెక్టర్ ఎవరంటే.?

వెంకటేష్ హీరోగా కె మురళీ మోహన్‌రావు దర్శకత్వం వహించిన త్రిమూర్తులు అనే సినిమా 1987వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో వెంకటేష్‌తో పాటు రాజేంద్రప్రసాద్, అర్జున్ లాంటివారు కూడా కీ రోల్స్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి నాగార్జున, బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చంద్రమోహన్‌, మురళీ మోహన్‌, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి, పద్మనాభం, విజయశాంతి, రాధ, భాను ప్రియ, రాధికతోపాటు శారద, జయమాలిని, అనురాధ, వై విజయ లాంటి నటీనటులు గెస్ట్‌లుగా కనిపించారు.

45
టాలీవుడ్ స్టార్స్ అందరూ..!

మొత్తం టాలీవుడ్ స్టార్స్ అందరూ ఏకమై.. ఈ సినిమాలో భాగమయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది భారీ మల్టీస్టారర్ సినిమా అని చెప్పాలి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. మూవీ విఫలమైనప్పటికీ ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్స్ అందరూ కలిసి నటించడం ఓ స్పెషల్ అని చెప్పొచ్చు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కలిసి నటించిన సినిమాగా త్రిమూర్తులు నిలిచింది. ఈ సినిమాలో తప్ప బాలయ్య ఏ సినిమాలో కూడా గెస్ట్ పాత్రలలో కనిపించలేదు.

55
అఖండ 2తో బాలయ్య..

డిసెంబర్‌లో అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ. ఈ చిత్రంతో మరో హిట్ కొట్టారు. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో మూవీ ఇది కాగా.. అఖండకు సీక్వెల్‌గా తెరకెక్కింది. ఇక త్వరలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories