ప్రభాస్‌ను 'అన్న' అని పిలిచిన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది..

Published : Jan 12, 2026, 08:30 AM IST

Prabhas: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కేర్లేదు. అతడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. బాహుబలి 1 & 2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఈ హీరోను.. ఓ హీరోయిన్ అన్న అని పిలిచింది. అది మీకు తెలుసా.? ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

PREV
15
హీరోతో పాన్ ఇండియా స్టార్..!

ప్రభాస్.. ఈ పేరు తెలుగు తెరకు సుపరిచితమే. హీరో నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈశ్వర్ సినిమాతో అరంగేట్రం చేసి.. బాహుబలి 1 & 2 మూవీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా 'ది రాజా సాబ్' సినిమాతో థియేటర్లలోకి వచ్చేశాడు.

25
కలల రాకుమారుడు..

ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ప్రభాస్‌తో నటించేందుకు చాలామంది హీరోయిన్లు మొగ్గు చూపుతుంటారు. రెబల్ స్టార్ హీరోయిన్లకు కలల రాకుమారుడిగా మారిపోయాడు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఏకంగా తనను 'అన్న' అని పిలిచిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్ అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి.

35
ఆమె ఎవరంటే.?

ఆమె మరెవరో కాదు.. 'జాతిరత్నాల' ఫేం ఫరియా అబ్దుల్లా. గతంలో ఫరియా అబ్దుల్లా ఓ బుల్లితెర కార్యక్రమానికి వచ్చింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను యాంకర్ శ్రీముఖి, ఆటో రాంప్రసాద్ ఓ ప్రశ్న అడిగారు. మీకు ఇష్టమైన హీరో ఎవరూ అంటూ ప్రశ్నించారు. దానికి ఆమె ఇలా చెప్పింది.

45
ప్రభాస్ 'అన్న' అని కామెంట్..

ఇంకెవరు.. ప్రభాస్ అన్న అంటూ సమాధానమిచ్చింది. దీంతో అప్పుడు షాక్ అయిన శ్రీముఖి.. ప్రభాస్ నీకు అన్న.. నాకు మాత్రం జస్ట్ ప్రభాస్ అంటూ కామెంట్ చేసింది. అప్పట్లో వీరిద్దరి కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. అయ్యబాబోయ్.! ఇదేంటి ఇంత మాట అనేసిందని.. అప్పట్లో నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తించారు.

55
జాతిరత్నాలతో ఫేం..

'జాతిరత్నాలు' సినిమాతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఫరియా అబ్దుల్లా.. ఆ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టింది. ఆ మూవీలోని 'చిట్టి' పాత్రతో బాగా పాపులారిటీ సంపాదించింది. అయితే ఆ తర్వాత ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు తలుపు తట్టలేదు. కొన్ని స్పెషల్ సాంగ్స్‌లో ప్రేక్షకులను అలరించింది.

Read more Photos on
click me!

Recommended Stories