ఇటీవల విడుదలైన మహావతార్ నరసింహ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తోంది. సైలెంట్ గా థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం నరసింహ గర్జనతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. యానిమేటెడ్ చిత్రం అయినప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కన్నడ భాషలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ తెలుగు లో డబ్ చేసి రిలీజ్ చేశారు. 40 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియా మొత్తం 200 కోట్లకి పైగా వసూళ్లతో దూసుకుపోతోంది.
25
అల్లు అరవింద్ తో కలిసి మూవీ చూసిన చాగంటి
అశ్విన్ కుమార్ దర్శకత్వంలో మహావతార్ నరసింహ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని తాజాగా ప్రముఖ పంచాంగ కర్త చాగంటి కోటేశ్వరరావు వీక్షించారు. అల్లు అరవింద్ తో కలిసి చాగంటి ఈ చిత్రాన్ని చూడడం జరిగింది. థియేటర్ లో మూవీ చూస్తూ చాగంటి చేతులెత్తి మొక్కారు. మూవీ చూసిన అనంతరం సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు.
35
నరసింహ అవతారం చాలా ప్రత్యేకం
చాగంటి మాట్లాడుతూ మహావతార్ నరసింహ చిత్రాన్ని వీక్షించాను. మహావిష్ణవు అవతారాలలో నరసింహ అవతారానికి చాలా ప్రత్యేకత ఉంది. నరసింహ అవతారంలో ఉగ్రరూపం మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆ అవతారంలో విచక్షణ, ఆలోచన, దయ కూడా ఉన్నాయి అని చాగంటి అన్నారు. ఇది యానిమేషన్ చిత్రం అయినప్పటికీ ప్రహ్లాదుడిని, హిరణ్యకశ్యపుడిని, నరసింహ అవతారాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లే అనిపించింది.
నిజంగా నరసింహ దర్శనం కలిగినంత ఆనందం కలిగింది. ఈ చిత్రంలో ఎక్కడా కూడా పురాణాలకు అతిగా దూరం జరగకుండా కథని రూపొందించారు. ఇది కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ చిత్రం అని చాగంటి ప్రశంసించారు.
55
చాగంటి ప్రశంసలు
ఇప్పటికే ఈ చిత్రం సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇలాంటి టైంలో చాగంటి లాంటి ప్రవచన కర్త ఈ మూవీ బావుందని చెప్పడం, ప్రశంసలు కురిపించడం మహావతార్ నరసింహ చిత్ర యూనిట్ కి జోష్ నింపే అంశం అని చెప్పొచ్చు.