ఈ సంక్రాంతికి వరుసగా నాలుగో హిట్టు కొట్టిన నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా పద్మభూషణ్ అవార్డుకి కూడా ఎంపికయ్యారు. బుల్లితెరపై అన్ స్టాపబుల్ అనే టాక్ షోతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలయ్య వరుసగా మూడవసారి హిందూపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందంతా చూస్తుంటే బాలయ్యకి ప్రస్తుతం మహర్దశ నడుస్తున్నట్లు ఉంది. బాలయ్య పట్టిందల్లా బంగారం అవుతోంది.
కెరీర్ పరంగా బాలయ్య స్టైల్ మార్చారు. వరుసగా యంగ్ డైరెక్టర్స్ తో పనిచేయడం వల్ల విజయాలు దక్కుతున్నాయి. ఇక పర్సనల్ లైఫ్ లో బాలయ్య కొన్ని నియమాలు పాటిస్తారు. టాలీవుడ్ లో ఈ రకమైన అలవాట్లు ఉన్న ఏకైక హీరో బాలయ్య మాత్రమే అని చెప్పొచ్చు. షూటింగ్ తో ఎంత బిజీగా ఉన్నా, ఎంత లేటుగా షూటింగ్ ముగించుకుని వచ్చినా ప్రతి రోజూ ఉదయం 3.30 గంటలకు నిద్రలేవడం బాలయ్యకి అలవాటు.
నిద్ర లేవగానే బాలయ్య భూమాతకి నమస్కరించి పాదాలు నేలపై పెడతారట. ఆ తర్వాత స్నానం చేసి సూర్యోదయం లోపే పూజ చేసుకుంటారు. బాలయ్యకి దైవభక్తి ఎక్కువ. భగవంతుడి కోసం సమయం కేటాయిస్తే మనకోసం మనం టైం కేటాయించుకున్నట్లే అని బాలయ్య చెబుతారట. అందుకే ప్రతిరోజూ పూజకి సమయం కేటాయిస్తారు.
బాలకృష్ణకి తెలుగు పద్యాలు, సంస్కృతంలో మంచి పట్టు ఉంది. చిన్నతనంలో ప్రత్యేకంగా తెలుగు మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకున్నారు. ఈ ప్రతిభ కలిగిన అతి కొద్దిమంది తెలుగు హీరోల్లో బాలయ్య ఒకరు. బాలయ్యకి మాస్ ఇమేజ్ తీసుకువచ్చి ఆయన స్టైల్ పూర్తిగా మార్చేసిన చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్. తాను ఎన్ని గొప్ప చిత్రాల్లో నటించినా సమరసింహారెడ్డి చిత్రానికి మాత్రం తిరుగులేదని, తన చిత్రాల్లో ఇష్టమైన మూవీ అదేనని బాలయ్య చెబుతుంటారు.