రామ్ చరణ్ అయిపోయాడు ఇక మరో పాన్ ఇండియా హీరోతో శంకర్ సినిమా..?

First Published | Jan 12, 2025, 4:52 PM IST

మెగా పవర్ స్టార్ గ్లోబల్ హీరో రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేశాడు శంకర్. ఇక మరో టాలీవుడ్ పాన్ ఇండియా హీరోతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఇంతకీ ఎవరా హీరో..? 

Director Shankar

సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ మరో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా సినిమాల విషయంలో ఘోరంగా విఫలం అవుతున్నాడు శంకర్. ఒకప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించి చరిత్ర సృష్టించిన శంకర్.. ఆతరువాత కాలంలో డిజాస్టర్లు ఫేస్ చేస్తున్నాడు. శంకర్ చివరి సారిగా 2010 లో ఆయన రేంజ్ సినిమా చేశాడు. ఆసినిమా దేశ వ్యాప్తంగా చరిత్ర సృష్టించింది. ఇక ఆతరువాత వరుసగా సినిమాలు ప్లాప్ అవుతూ వచ్చాయి. 
 

ఇక వెరీ రీసెంట్  కమల్ హాసన్ తో ఇండియన్2 సినిమాలో కూడా నటించగా.. ఈసినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. అదికాక రామ్ చరణ్ తో చేసిన గేమ్ ఛేంజర్ గురించి అభిమానులు భయపడుతూ వచ్చారు ఫ్యాన్స్. వారు అనుకున్నట్టే జరిగింది. గేమ్ ఛేంజర్.. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రామ్ చరణ్ రేంజ్ సినిమా కాదు ఇది అంటూ ప్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఇక ట్రోలర్స్ తమ సోషల్ మీడియా ఖాతాలకు పనిచేపుతున్నారు. 


Director Shankar

ఈక్రమంలో శంకర్ టాలీవుడ్ నుంచి మరో పెద్ద హీరోతో సినిమా ప్లాన్ చేశాడట. మరి అది వర్కౌట్ అవుతుందా లేదా తెలియదు కాని ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. శంకర్ చాలా కాలంగా టాలీవుడ్ నుంచి ముగ్గురు హీరోల కోసం సినిమా చేయాలని ప్రయత్నం చేశాడట. అందులో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారు. అయితే చిరంజీవితో సినిమా చేయాలి అనుకుంటే రామ్ చరణ్ తోవర్కౌట్ అయ్యింది. 

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమానుంచి బయటపడాలంటే ఓ నాలుగైదేళ్లు పైనే పడుతుంది. ఇక ప్రభాస్ తో సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడట శంకర్. ఇక రామ్ చరణ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఉంటే ఇది జరిగి ఉండేదేమో.. కాని రామ్ చరణ్ మూవీ కూడా ఆ రేంజ్ హిట్ అవ్వలేదు కాబట్టి ఈసినిమా వర్కౌట్ అవ్వదనే చెప్పవచ్చు. 

Director Shankar

శంకర్ కనుక రామ్ చరణ్ సినిమా విషయంలో జాగ్రత్గగా ఉండి ఉంటే.. ప్రభాస్ సినిమా పక్కాగా పిక్స్ అయ్యేది అంటున్నారు సినిమా జనాలు. ఇక శంకర్ నెక్ట్స్ ఏం చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. రజినీకాంత్ బయోపిక్ మూవీ చేయాలి అని చాలా రోజులుగా అనుకుంటున్నారట శంకర్. మరి అది వర్కౌట్ చేస్తారా అనేది చూడాలి. ఒక వేళ అదే వర్కౌట్ అయితే.. ధనుష్ లీడ్ క్యారెక్టర్ చేసే అవకాశం కనిపిస్తుంది.   

Latest Videos

click me!