తెలుగు చిత్రాలకు నెమ్మదిగా అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కల్కి లాంటి చిత్రాలు అంతర్జాతీయంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి. ఓటీటీ పుణ్యమా అని తెలుగు చిత్రాలు వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా బాలయ్య డాకు మహారాజ్ చిత్రం కూడా ప్రపంచ స్థాయిలో అనేక దేశాల్లో ట్రెండింగ్ గా నిలిచింది. ముఖ్యంగా పాకిస్తాన్ లో డాకు మహారాజ్ దూసుకుపోతోంది.