'అక్కినేని తొక్కినేని' అంటూ నోరు జారిన బాలయ్య.. ముదురుతున్న వివాదం, నోటికి ఎంతొస్తే అంతేనా..

First Published Jan 23, 2023, 5:40 PM IST

విజయోత్సవ వేడుకలో బాలయ్య ప్రసంగంలో ఎన్నో వివాదాస్పద అంశాలు తలెత్తాయి. బాలకృష్ణ ఒక ప్రవాహంలాగా మాట్లాడేస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి విడుదలైంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.  బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. గోపీచంద్ బాలయ్యని ఫ్యాన్స్ కోరుకునే విధంగా పర్ఫెక్ట్ మాస్ అవతారంలో ప్రజెంట్ చేశారు. ఈ మూవీ ఆశించిన సక్సెస్ సాధించడంతో నిర్మాతలు ఆదివారం రోజు విజయోత్సవ వేడుక నిర్వహించారు.

విజయోత్సవ వేడుకలో బాలయ్య ప్రసంగంలో ఎన్నో వివాదాస్పద అంశాలు తలెత్తాయి. బాలకృష్ణ ఒక ప్రవాహంలాగా మాట్లాడేస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కేసులు పెట్టడం చాలా తేలిక అంటూ ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. 

ఇక బాలయ్య చేసిన మరో కామెంట్ తీవ్ర వివాదంగా మారుతోంది. వీరసింహారెడ్డి షూటింగ్ లో జరిగిన సంగతులు వివరిస్తూ.. ఓ ఆర్టిస్ట్ తో కలసి పాత విషయాలన్నీ మాట్లాడుకునే వాళ్ళం అని తెలిపాడు. వేద శాస్త్రాలు, నాన్నగారి డైలాగులు,, ఆ రంగారావు .. అక్కినేని తొక్కినేని ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అని అన్నారు. 

ఇక్కడ బాలయ్య అక్కినేని తొక్కినేని అని అనడంతో అక్కినేని అభిమానులు తీవ్రంగా తప్పు బడుతున్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడమేనా అని వివమర్శిస్తున్నారు. నిత్యం తండ్రి జపం చేసే బాలయ్య.. ఇతర లెజెండ్స్ కి కూడా గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి అని దుమ్మెత్తి పోస్తున్నారు. బాలయ్య ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తొలిసారి కాదు. గతంలో ఓ చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో బాలయ్య మహిళల గురించి చేసిన కామెంట్స్ ఎంత వివాదం సృష్టించాయో తెలిసిందే. 

Nagarjuna

అక్కినేని నాగేశ్వర రావు ని కించపరిచేలా తొక్కినేని అనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ బాలయ్య, నాగార్జున మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు ఎటువైపు దారి తీస్తాయో చూడాలి. 

అయితే బాలయ్య నోరు జారడాన్ని కొందరు అభిమానులు సమర్థిస్తున్నారు. అవి బాలయ్య ఇంటెన్షనల్ గా చేసిన కామెంట్స్ కాదు అని అంటున్నారు. కానీ గతంలో అక్కినేని నాగేశ్వర రావు ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ గురించి చెడుగా చేసిన విమర్శల్ని గుర్తు చేసుకుంటున్నారు. 

అయితే కామన్ ఆడియన్స్ మాత్రం బాలయ్య తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి తెలియకుండా మాట్లాడడానికి బలకృష్ణ ఏమి చిన్న పిల్లాడు కాదు. స్వర్గీయ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న సీనియర్ నటుడు. పైగా ఎమ్మెల్యేగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. పొలిటికల్ గా విమర్శలు చేయవచ్చు కానీ.. లెజెండ్స్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి అని సూచిస్తున్నారు. 

click me!