నందమూరి బాలకృష్ణకి ముక్కుసూటిగా మాట్లాడడం అలవాటు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తారు. అలా మాట్లాడడం కొన్నిసార్లు వివాదాలకు కారణం అవుతూ ఉంటుంది. బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదిగే వరకు ఆయన చిత్రాల కథలని స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎంపిక చేసేవారు. ఆయన ఫైనల్ చేసిన చిత్రాల్లోనే బాలయ్య నటించేవారు. ఆ విధంగా ఎన్టీఆర్ ఎంపిక చేసిన చిత్రాలు చాలా వరకు సూపర్ హిట్స్ అయ్యాయి.