హరీష్ శంకర్ చివరగా రూపొందించిన మిస్టర్ బచ్చన్ చిత్రం డిజాస్టర్ అయింది. దీనితో హరీష్ బాలయ్య మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. వన్ లైన్ డైలాగులు రాయడంలో హరీష్ కి మంచి పట్టు ఉంది. అలాంటిది హరీష్, బాలయ్య కాంబినేషన్ లో మూవీ అంటే ప్రారంభం నుంచే అంచనాలు పెరిగిపోవడం ఖాయం. ఈ చిత్రాన్ని శాండల్ వుడ్ కి చెందిన కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యానర్ లో యష్ టాక్సిక్, విజయ్ జన నాయగన్ చిత్రాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం పూర్తి చేయాల్సి ఉంది. కానీ పవన్ బిజీగా ఉండడం వల్ల ఈ చిత్రానికి బ్రేక్ పడింది.