ఎన్టీఆర్‌ సినిమా డైరెక్టర్‌కి 50 కోట్ల పారితోషికం, లాభాల్లో షేర్‌, నిర్మాతలు అడ్వాన్స్ చెక్‌.. ఎవరా దర్శకుడు ?

Published : Feb 14, 2025, 03:57 PM IST

Ntr Next movie: ఎన్టీఆర్‌ చేతిలో ప్రస్తుతం మూవీ సినిమాలున్నాయి. తాజాగా మరో కొత్త సినిమాకి సంబంధించిన అదిరిపోయే వార్త లీక్‌ అయ్యింది. కోలీవుడ్‌ డైరెక్టర్‌తో మూవీ చేయబోతున్నారట.    

PREV
15
ఎన్టీఆర్‌ సినిమా డైరెక్టర్‌కి 50 కోట్ల పారితోషికం, లాభాల్లో షేర్‌, నిర్మాతలు అడ్వాన్స్ చెక్‌.. ఎవరా దర్శకుడు ?
NTR

Ntr Next movie:  జూ ఎన్టీఆర్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయన `వార్‌ 2` షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అనంతరం ప్రశాంత్‌ నీల్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఈ మూవీ చిత్రీకరణ వచ్చే వారం ప్రారంభమవుతుందని తెలుస్తుంది. భారీ యాక్షన్‌ మూవీగా దీన్ని ప్లాన్‌ చేస్తున్నారు. 

25
Ntr

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ సినిమాలకు సంబంధించిన లైనప్‌ మ్యాటర్‌ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ చేతిలో `వార్‌ 2`తోపాటు ప్రశాంత్‌ నీల్‌ మూవీ ఉంది. అలాగే కొరటాల శివ దర్శకత్వంలోనే `దేవర 2` చేయాల్సి ఉంది. దీంతోపాటు కొత్తగా మరో సినిమా ఓకే అయినట్టు తెలుస్తుంది. తమిళ దర్శకుడితో సినిమా ప్లానింగ్‌ జరుగుతుందట. 

35
nelson dileep kumar

`జైలర్‌` సినిమాతో కోలీవుడ్‌లో దుమ్ములేపిన నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ఓ మూవీ ఓకే అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. మైత్రీ నిర్మాతలు ఎన్టీఆర్‌-నెల్సన్‌ కాంబోని సెట్‌ చేస్తున్నారట. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం. 

45

అయితే ఈ మూవీకి నెల్సన్‌ పారితోషికం వివరాలు కూడా లీక్‌ అయ్యాయి. ఎన్టీఆర్‌ సినిమా కోసం ఏకంగా రూ కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నారట. ఈ మేరకు నిర్మాతలు డైరెక్టర్‌కి అడ్వాన్స్ చెక్‌ కూడా ఇచ్చారట. కేవలం రూ50కోట్లు మాత్రమే కాదు, లాభాల్లో షేర్‌ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇదే నిజమైతే సౌత్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడిగా నెల్సన్‌ నిలుస్తాడని తెస్లుంది.  తారక్‌తో నెల్సన్‌ ఒక యాక్షన్‌ ప్యాక్డ్ మూవీని ప్లాన్‌ చేస్తున్నారట. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ మూవీ వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 

55

ప్రస్తుతం నెల్సన్‌.. రజనీకాంత్‌ హీరోగా `జైలర్‌ 2` మూవీని రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. ఇందులో మోహన్‌ లాల్‌, శివ రాజ్‌ కుమార్‌ గెస్ట్ లుగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలయ్య కూడా గెస్ట్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

read  more: Brahma Anandam Movie Review: `బ్రహ్మా ఆనందం` మూవీ రివ్యూ, రేటింగ్‌

also read: 15 సినిమాల్లో నటిస్తే 11 హిట్లు..కాజల్, తమన్నా, సమంత కాదు.. మెగా ఫ్యామిలీ ఆమెని నెత్తిన పెట్టుకోవచ్చు
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories