విశ్వక్ సేన్, ఆనంద్ దేవరకొండ, ఆకాశ్ పూరి.. హిట్లు లేకున్నా తగ్గేదిలేదంటున్న హీరోలు. యంగ్ స్టార్స్ కాన్ఫిడెంట్

Published : Mar 18, 2022, 05:12 PM ISTUpdated : Mar 18, 2022, 05:30 PM IST

హిట్లు లేకపోయినా తగ్గేది లేదంటున్నారు యంగ్ స్టార్స్.. ప్రొడ్యూసర్లు ,డైరెక్టర్లుంటే చాలు. సినిమాలు చేసుకుంటూనే పోతామంటున్నారురిజల్ట్ సంగతి పక్కన  పెడితే .. టాలీవుడ్ యంగ్ హీరోలంతా వరుస సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు.    

PREV
19
విశ్వక్ సేన్, ఆనంద్ దేవరకొండ, ఆకాశ్ పూరి..  హిట్లు లేకున్నా తగ్గేదిలేదంటున్న హీరోలు. యంగ్ స్టార్స్ కాన్ఫిడెంట్

విచిత్రంగా లైమ్ లైట్లో ఉన్న హీరోలు కూడా లేనంత బిజీగా ప్లాప్ హీరోల సినిమాలు సెట్స్ మీదకు వెళ్తుననాయి.  స్టార్ హీరోలు కూడా ఆలోచిస్తున్న టైమ్ లో ఈ యంగ్ హీరోలు మాత్రం వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఫ్లాపులు పలకరిస్తున్నా..  సక్సెస్ తో సంబందం లేకుండా సినిమా ఆఫర్లు కొట్టేస్తున్న యంగ్ స్టార్స్ గురించి ఇప్పుడు చూద్దాం. 

29

ఫిల్మ్ ఇండస్ట్రీలో పాతుకుకోవడం కోసం రకరకాలు ప్రయత్నాలు చేస్తున్నారు యంగ్ హీరోలు కొంత మంది..అసలు సక్సెస్ తో పనిలేకుండా... సినిమా తీసే ప్రొడ్యూసర్ , డైరెక్టర్ ఉంటే చాలు .. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సంబందం లేకుండా సినిమా ఆఫర్లు వస్తూనే ఉంటాయి. ఈ ఫార్ములాను బాగా ఫాలో అవుతున్నాడు మాస్ కా దాస్ విష్వక్ సేన్. రిజల్ట్ ని పక్కన పెట్టి వరసగా సినిమాలు చేస్తున్నాడు. పాగల్  సినిమాతో ఫ్లాప్ ఫేస్ చేసిన విష్వక్ ..లేటెస్ట్ గా దాస్ గా దమ్కీ  సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలతో పాటు అశోక వనంలో అర్జున కళ్యాణం  సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది.

39

విజయ్ దేవరకొండ అండతో ఇండస్ట్రీకి వచ్చి..మిడిల్ క్లాస్ మెలొడీస్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన ఆనంద్  దేవరకొండ,పుష్పకవిమానం మూవీతో డిసప్పాయింట్ చేశాడు . అయినా ఆఫర్ల కోసం వెయిట్ చెయ్యకుండానే వరసగా సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. హైవే, బేబీ సినిమా షూట్స్ తో బిజీగా ఉన్న ఆనంద్ ..లేటెస్ట్ గా గంగంగణేశా అనే మరో కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. 
 

49

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో హీరో మెటీరియల్ అనిపించుకున్నాడు కిరణ్ అబ్బవరం. రాజావారు-రాణిగారు , ఎస్ . ఆర్ కళ్యాణమండపం సినిమాలతో సక్సెస్ అయిన కుర్ర హీరో రీసెంట్ గా వచ్చిన సెబాస్టియన్  పిసి 524 తో ఫ్లాప్ ఫేస్ చేశాడు.  హ్యాట్రిక్ హిట్ మిస్స్ అయినా పర్లేదు.. నెక్ట్స్ సినిమాతో చూసుకుంటా అంటున్నాడు. అయినా సరే  వరసగా సినిమా ఆఫర్లుతెచ్చుకున్నాడు. సమ్మతమే, నేను మీకు బాగా కావల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణుకథ అనే క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు కిరణ్ అబ్బవరం .

59

 ఆది సాయి కుమార్  హిట్ అన్న మాట విని కొన్ని సంవత్సరాలు అయ్యింది. కానీ ఇంకా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు యంగ్ హీరో..ఈమధ్య కాలంలో హిట్ లేని ఏ హీరోకూ లేనన్ని సినిమాలతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నారు ఆది. లాస్ట్ ఇయర్ శశి, ఈ సంవత్సరం అతిధి దేవో భవ సినిమాలతో ఫ్లాప్స్ ఫేస్ చేసిన యంగ్ స్టార్.. ప్రజెంట్ జంగిల్, కిరాతక, సిఎస్ ఐ సనాతన్, బ్లాక్ ..ఇలా నాలుగైదు సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. 
 

69

పూరీ జగన్నాథ్ వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన  ఆకాష్ పూరీ కూడా కెరీర్ లో పెద్ద హిట్ కొట్టలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి సినిమాలు చేసిన ఆకాశ్.. ఎందుకో హీరోగా సెట్ అవ్వలేకపోయాడు. అయినా సక్సెస్ కోసం ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు. రొమాంటిక్ టైటిల్ తో తెరకెక్కిన గత సినిమా కు ప్రభాస్ తో ప్రమోషన్లుచేయించినా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు . అయినా ఏమాత్రం తగ్గకుండా మరో సినిమా రిలీజ్ కు రెడీ అయ్యాడు. జార్జి రెడ్డి డైరెక్టర్ జీవన్ రెడ్డి డైరెక్షన్లో చోర్ బజార్ అనే మరో ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్ తో తన లక్ చెక్ చేస్కోబోతున్నాడు.
 

79

ఇక ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడు .నిర్మలా కాన్వెంట్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో పెళ్లి సందడి తో మరోసారి లక్ చెక్ చేసుకున్నాడు. కమర్షియల్ ఫ్యామిలీ లవ్ స్టోరీ గా తెరకెక్కిన  పెళ్లి సందడి అనుకున్నంత సక్సెస్ కాకపోయినా.. లేటెస్ట్ గా వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్లో  సినిమా అనౌన్స్ చేశారు. ప్రదీప్ అద్వైతం డైరెక్టర్ గా ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతోంది.

89

అటు స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఫ్యామిలీ నుంచి వచ్చిన కీరవాణి కొడుకు శ్రీసింహ హీరోగా  మత్తు వదలరా, తెల్లవారితే గురువారం  సినిమాలు రిలీజ్ అయ్యాయి. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా .. అంతగా ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయాయి. ఆ సినిమాలు సక్సెస్ కాకపోయినా మళ్లీ కొంత గ్యాప్ తర్వాత కొత్త సినిమా అనౌన్స్ చేశాడు సింహ.  సురేష్ ప్రొడక్షన్స్ లో దొంగలున్నారు జాగ్రత్త అనే క్రేజీ కంటెంట్ తో కొత్తసినిమా మేకింగ్ లో బిజీగా ఉన్నాడు సింహ.

99

ఇలా యంగ్ హీరోలు చాలా మంది సక్సెస్ లేకపోయినా సినిమాలు మాత్రం వదలడం లేదు. హీరో శర్వానంద్, నితిన్, రాజ్ తరుణ్  లాంటి సెటిల్ అయిన స్టార్స్ కూడా హిట్ కు దూరం అయ్యి చాలా కాలం అవుతున్నా.. వరుస సినిమాలు సెట్స్ ఎక్కిస్తూ.. తగ్గేది లేదంటున్నారు. 
 

click me!

Recommended Stories