కృష్ణ సినిమా షూటింగ్‌ మధ్యలోనే వెళ్లిపోయిన నగ్మా.. డైరెక్టర్‌తో గొడవేంటి? తెరవెనుక అసలేం జరిగిందంటే?

Published : Mar 23, 2024, 06:56 PM IST

నగ్మ స్టార్‌ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమని ఓ ఊపు ఊపేసింది. కానీ కృష్ణతో ఓ సినిమా షూటింగ్‌ టైమ్‌లో పెద్ద రచ్చ చేసింది. మధ్యలోనే వెళ్లిపోయిందట. 

PREV
16
కృష్ణ సినిమా షూటింగ్‌ మధ్యలోనే వెళ్లిపోయిన నగ్మా.. డైరెక్టర్‌తో గొడవేంటి? తెరవెనుక అసలేం జరిగిందంటే?

 సూపర్‌ స్టార్‌ కృష్ణ అది పీక్‌లో ఉన్న టైమ్‌. ఆయన సూపర్‌ స్టార్‌గా వెలుగొందుతున్నాడు. ఏడాదికి పది పదిహేను సినిమాలు చేస్తున్న రోజులు. ఆ సమయంలో నగ్మా కూడా పీక్‌లోనే ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా వచ్చింది. 

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

26

కృష్ణ, నగ్మా కలిసి `భరత సింహాం` అనే చిత్రంలో నటించారు. దర్శకుడు సాగర్‌. ఈ మూవీ షూటింగ్‌ టైమ్‌లో నగ్మా షూటింగ్‌ మధ్యలోనే ముంబయి వెళ్లిపోయింది. షూటింగ్‌కి రాలేదు. బిగ్‌ హ్యాండిచ్చింది. కృష్ణ లాంటి సూపర్‌ స్టార్‌ సినిమాకే ఆమె ఇలా చేయడంతో అది పెద్ద ఇష్యూ అయ్యింది. సినిమా ఆగిపోయే పరిస్థితి. మరి నగ్మా ఎందుకు వెళ్లిపోయింది. తెరవెనుక ఏం జరిగిందనేది చూస్తే. 
 

36

ఈ మూవీలో హీరోయిన్‌కి పొట్టి కాస్ట్యూమ్ కావాల్సి ఉంది. అది టీమ్‌ కుట్టించడం ఎందుకు ఆమెనే తీసుకొచ్చుకోమ్మని దర్శకుడు సాగర్‌ చెప్పాడు. దర్శకుడు చెప్పింది నిర్మాత.. హీరోయిన్‌కి చెప్పాడు. ఆమె రెండు పొట్టి నిక్కర్లు తీసుకుని షూటింగ్‌కి వచ్చిందట. దాని బిల్‌ ఆరవై వేలు చూపించింది. దీంతో అంతా షాక్‌. రెండు పొట్టి నిక్కర్ల కోసం ఇంత మనీనా అనేది అందరి సందేహం. అప్పట్లో 60వేలు అంటూ మామూలు కాదు, ఆల్మోస్ట్ ఇప్పుడు 6లక్షలతో సమానం. ఇంకా ఎక్కువే. 
 

46

అంత అమౌంట్‌ ఇచ్చేందుకు నిర్మాత నిరాకరించాడు. దీంతో ప్రొడ్యూసర్‌తో గొడవ. షూటింగ్‌ ఆగిపోతుంది, ప్రాబ్లెమ్‌ అవుతుందని భావించిన సాగర్‌, తనే ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. కానీ నగ్మా తీసుకోలేదు. నిర్మాత ఇస్తేనే తీసుకుంటా అని మొండికేసింది. ఇలా నిర్మాత, నగ్మా, దర్శకుడి మధ్య ఈ చర్చలు నడుస్తూనే ఉన్నాయి. 
 

56

గొడవ పెద్దది అవుతుంది. షూటింగ్‌ డిలే అవుతుంది. ఇక చివరికి దర్శకుడు సాగర్‌కి కోపం వచ్చింది. బాగా తిట్టేశాడట. దీంతో ఆ కోపంలో ఆమె షూటింగ్‌ నుంచి వెళ్లిపోయిందట. మళ్లీ రాలేదు. దీంతో కృష్ణ కలగజేసుకున్నాడు. అయిన ప్రయోజనం లేదు, నగ్మా వినలేదు. దీంతో చివరికి ఆ పాత్రనే మార్చేశారట. రైటర్‌ కూర్చొని మరో వెర్షన్‌ రాసుకున్నాడట. కానీ సినిమా పోయిందని తెలిపారు సాగర్‌. అలా `భరతసింహాం` మూవీ డిజాస్టర్‌ అయ్యిందని వెల్లడించారు. మళ్లీ నగ్మాతో పనిచేయలేదన్నారు. 

66
Actress Nagma

కృష్ణ కూడా నగ్మతో పనిచేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఆ సంఘటనతో ఆయనకు మండిందట. అందుకే దూరం పెట్టినట్టు సమాచారం. ఆ తర్వాత నాగార్జున నటించిన `వారసుడు`లో నటించారు. కానీ అందులో కృష్ణకి ఆమె పెయిర్‌ కాదు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories