చెబితే బలుపు అనుకుంటారు.. గుంటూరు కారంతో రాజమౌళి కలెక్షన్లే టార్గెట్, నిర్మాత కామెంట్స్ 

First Published | Dec 31, 2023, 8:26 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు (రాధాకృష్ణ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు (రాధాకృష్ణ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ ఈ చిత్రం నుంచి మూడు పాటలు విడుదలయ్యాయి. 

వీటిలో కుర్చీ మడతపెట్టి, ఓ మై బేబీ అనే పాటలపై ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ పై ఉన్న అంచనాలకు తగ్గట్లుగా సాంగ్స్ లేవనే విమర్శ వినిపిస్తోంది. అయితే చాలా కాలం తర్వాత త్రివిక్రమ్, మహేష్ కాంబోలో చిత్రం వస్తుండడం.. మహేష్ మాస్ గెటప్ లో కనిపిస్తుడడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. 


సరిగ్గా పండగ టైంలో జనవరి 12న గుంటూరు కారం చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ ఇంకా ఎవరూ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగలేదు. అయితే నిర్మాత నాగవంశీ తాజాగా ఇంటర్వ్యూలో గుంటూరు కారం చిత్రంపై అంచనాలు మరింత పెంచేలా హాట్ కామెంట్స్ చేశారు. 

గుంటూరు కారం చిత్రం ఎలా ఉండబోతోంది అని యాంకర్ ప్రశ్నించగా.. నేను చెబితే బలుపు అనుకుంటారు. గుంటూరు కారం కంటెంట్ నాకు తెలుసు. ఆల్రెడీ కొంత చూసాను కూడా. రాజమౌళి సినిమా కలెక్షన్స్ కి దగ్గరగా వెళుతున్నాం అని అన్నారు. 

Nagavamsi

ప్రతి ఏరియాలో రాజమౌళి కలెక్షన్స్ కి గుంటూరు కారం కలెక్షన్స్ క్లోజ్ గా ఉంటాయి. ఇది నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను అని నాగవంశీ అన్నారు. అల వైకుంఠపురములో చిత్రానికి కూడా అలాగే చేశామని అన్నారు. 

మహేష్ బాబు సరసన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ లో మహేష్, శ్రీలీల ఇద్దరూ పూనకం వచ్చినట్లు డ్యాన్స్ అదరగొట్టారు. వీళ్లిద్దరి కాంబినేషన్, కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్ పై ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. 

Latest Videos

click me!