సూపర్ స్టార్ కృష్ణపై నాగార్జున సెటైర్ ? ఆయన అట్టర్ ఫ్లాప్ మూవీని ఎత్తి చూపి ఏమన్నారో తెలుసా..
అక్కినేని నాగార్జున ప్రస్తుతం వైవిధ్యమైన బాటలో పయనిస్తున్నారు. సోలో హీరోగా కంటే నాగ్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రాలే ఎక్కువ సందడి చేస్తున్నాయి.
అక్కినేని నాగార్జున ప్రస్తుతం వైవిధ్యమైన బాటలో పయనిస్తున్నారు. సోలో హీరోగా కంటే నాగ్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రాలే ఎక్కువ సందడి చేస్తున్నాయి.
అక్కినేని నాగార్జున ప్రస్తుతం వైవిధ్యమైన బాటలో పయనిస్తున్నారు. సోలో హీరోగా కంటే నాగ్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రాలే ఎక్కువ సందడి చేస్తున్నాయి. రజనీకాంత్ కూలి చిత్రంలో, ధనుష్ కుబేర చిత్రంలో నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
గతంలో నాగార్జున మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడం, ఓల్డ్ క్లాసిక్ చిత్రాలని రీమేక్ చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో నాగ చైతన్య, జూనియర్ ఎన్టీఆర్ గుండమ్మ కథ లాంటి ఆల్ టైం క్లాసిక్ మూవీ రీమేక్ లో నటించేందుకు ప్లాన్ చేశారట. కానీ ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు.
ఆ సమయంలో నాగార్జున సూపర్ స్టార్ కృష్ణ గురించి పరోక్షంగా సెటైర్లు వేశారు. చైతు, తారక్ గుండమ్మ కథ రీమేక్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్లిద్దరూ కలసి నటించాలనుకోవడం మంచి విషయమే. కానీ గుండమ్మ కథ ఎలాంటి చిత్రమో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలి అంటే చాలా జాగ్రత్తగా చేయాలి.
నా అభిప్రాయం ప్రకారం ఓల్డ్ క్లాసిక్స్ ని టచ్ చేయకుంటే బెటర్. దేవదాసు రీమేక్ ఏమైందో చూశారుగా అంటూ నాగార్జున పరోక్షంగా కృష్ణ గురించి తెలిపారు. 1953లో ఏఎన్నార్, సావిత్రి కలసి నటించిన దేవదాసు ఇండియన్ సినిమాలో గొప్ప చిత్రాల్లో ఒకటి. అల్లూరి సీతా రామరాజు లాంటి సంచలన హిట్ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ దేవదాసు చిత్రాన్ని రీమేక్ చేశారు. కానీ ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
ఇదే విషయాన్ని నాగార్జున ప్రస్తావిస్తూ క్లాసిక్ చిత్రాలని టచ్ చేయకుంటేనే ఉత్తమం అని అన్నారు. నాగార్జున, కృష్ణ కలసి రాముడొచ్చాడు, వారసుడు లాంటి చిత్రాల్లో నటించారు.