పుష్ప 2 పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఏకంగా ఈ చిత్రం 1800 కోట్ల పైగా వసూళ్లు రాబట్టింది. పుష్ప 2 చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అల్లు అర్జున్ క్రేజ్ ఊహించని విధంగా పెరిగింది. అల్లు అర్జున్ మ్యానరిజమ్స్, డ్యాన్సులు, డైలాగులకు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.