vaishnavi chaitanya
Vaishnavi Chaitanya: `బేబీ` సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయింది వైష్ణవి చైతన్య. దీంతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఆమెతో సినిమాలు చేసేందుకు మేకర్స్ క్యూ కడుతున్నారు. దీంతో ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా ఉంది వైష్ణవి చైతన్య. ఈ క్రమంలో తాజాగా పారితోషికం పెంచిందట. తెలుగు హీరోయిన్లలో సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తుంది వైష్ణవి.
vaishnavi chaitanya
వైష్ణవి చైతన్య `లవ్ ఇన్ 143 అవర్స్`, `ది సాఫ్ట్ వేర్ డెవలపర్`, `అరెరె మానస`, `మిస్సమ్మ` వంటి షార్ట్ ఫిల్మ్స్ తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి, ఆ తర్వాత `అల వైకుంఠపురములో`, వరుడు కావలెను` వంటి బిగ్ మూవీస్ లో కూడా చేసింది, బాగానే మెప్పించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ `బేబీ` ఆమె జీవితాన్నే మార్చేసింది. ఈ సినిమా సంచలన విజయంతో వైష్ణవి ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయింది.
vaishnavi chaitanya
`బేబీ` సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించగా, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఇది రూపొందింది. ఈ మూవీ ఏకంగా వంద కోట్లు వసూలు చేసింది. ఇందులో కథ మొత్తం వైష్ణవి చుట్టూనే సాగుతుంది. ఇందులో డిఫరెంట్ షేడ్స్ చూపిస్తూ అదరగొట్టింది వైష్ణవి. బెస్ట్ యాక్ట్రెస్‌గా పలు అవార్డులు కూడా అందుకుంది.
vaishnavi chaitanya
ప్రస్తుతం ఆమె `జాక్`చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో సిద్దు జొన్నలగడ్డ హీరో. ఇందులో వైష్ణవి ద్విపాత్రాభినయం చేస్తుంది. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 'శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర' బ్యానర్ పై అగ్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్నారు.
ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో పాటు '90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా రూపొందుతున్న సినిమాలో కూడా ఆనంద దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించనున్నారు వైష్ణవి. 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాని నిర్మించబోతున్నారు.
ఇలా రెండు పెద్ద బ్యానర్లలో మెయిన్ హీరోయిన్ గా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. దీంతోపాటో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి కూడా ప్లాన్ జరగుతుందట.