అవికా గోర్‌ గురించి ఎవరికి తెలియని సీక్రెట్‌ బయటపెట్టిన నాగార్జున.. వామ్మో చిన్నారి పెళ్లి కూతురు లెక్క వేరే!

First Published Jan 4, 2023, 3:20 PM IST

కింగ్‌ నాగార్జున.. హీరోయిన్‌ అవికా గోర్‌ గురించి అతిపెద్ద సీక్రెట్‌ బయటపెట్టారు. ఆమె పదేళ్ల క్రితమే పాన్‌ వరల్డ్ స్టార్‌ అంటూ అసలు విషయం చెప్పాడు. 

`చిన్నారి పెళ్లి కూతురు` సీరియల్‌ తో ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయ్యింది అవికా గోర్‌. ఆ సీరియల్‌ ఇండియాలోని చాలా భాషల్లో అనువాదం అయ్యింది. దానితోనే అవికా గోర్‌కి క్రేజ్‌, పాపులారిటీ, స్టార్‌ ఇమేజ్‌ వచ్చింది. ఆ తర్వాత తెలుగు `ఉయ్యాల జంపాల` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. వరుస సక్సెస్‌లు, పరాజయాలు చవిచూసిన అవికా గోర్‌ ఇప్పుడు హీరోయిన్‌గా బిజీ అవుతుంది. ఆమె లేటెస్ట్ గా నటించిన చిత్రం `పాప్‌ కార్న్`. సాయిరోనక్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి మురళిగందం దర్శకత్వం వహించారు. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై బోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 
 

బుధ‌వారం ఈ మూవీ ట్రైల‌ర్‌ను కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ట్రైలర్‌ బాగుందన్నారు. అంతేకాదు అవికా గోర్‌ గురించి అతిపెద్ద సీక్రెట్‌ బయటపెట్టారు. ఇందులో నాగార్జున చెబుతూ, పదేళ్ల క్రితం తాను బ్రెజిల్‌లో రియో నగరానికి వెళ్లారట. అక్కడ ఓ స్టూడియో చూద్దామని వెళ్లాడట. అందులో అవికా గోర్‌ ఫోటో కనిపించిందన్నారు. ఆ కథ చెబుతూ, `చిన్నారి పెళ్లి కూతురు` సీరియల్‌ని వాళ్లు కూడా డబ్‌ చేసి రిలీజ్‌ చేశారట. పెద్ద హిట్‌ అయ్యిందని వాళ్లు చెప్పారట. అంతేకాదు ఇప్పటికీ మీ వద్ద బాల్య వివాహాలు జరుగుతుంటాయా? అని అనేక రకాల ప్రశ్నలు వేస్తూ తమ ఆసక్తిని ప్రదర్శించారని తెలిపారు. 
 

అంతేకాదు ఆ సీరియల్‌ 128 దేశాల్లో డబ్‌ అయ్యిందని చెప్పారు. ఇప్పుడు మనం అంతా పాన్‌ ఇండియా స్టార్స్ అంటున్నాం కానీ, అవికా గోర్‌ పదేళ్ల క్రితమే పాన్‌ వరల్డ్ స్టార్‌ అని తెలిపారు. కజకిస్తాన్‌లో రెండు సినిమాలు చేసిందన్నారు నాగ్‌. అవికా సాధించింది మామూలు విషయం కాదు. తాను `మాటీవీ` హోనర్‌గా ఉన్నప్పుడు అవికా తనకు పరిచయం అని, ఆ తర్వాత ఆమెతో తమ ప్రొడక్షన్‌లో `ఉయ్యాల జంపాల` సినిమా చేశామన్నారు. ఆ సినిమా తర్వాత తెలుగు పెళ్లి కూతురు అయ్యామని చెప్పారు. ఇప్పుడు `పాప్‌ కార్న్` లోని పాటలో ఎంతో అందంగా ఉందన్నారు. టాలెంట్‌ బబుల్‌ అని తెలిపారు. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలన్నారు. కొత్త ఆర్టిస్టులు బాగా చేస్తే యూత్‌ యాక్సెప్ట్ చేస్తున్నారు. నిర్మాతగా అవికా మంచి విజయాన్ని అందుకోవాలని అభినందనలు తెలిపారు నాగార్జున.  

ఇక పాప్‌ కార్న్ ట్రైలర్‌ చూస్తే.. అవికా గోర్‌, సాయి రోన‌క్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. డిఫ‌రెంట్ మైండ్స్ సెట్స్ ఉన్న ఇద్ద‌రు వ్య‌క్తుల అనుకోకుండా లిఫ్ట్‌లో చిక్కుకుంటారు. వారిని ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ముందు ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌కుండా ఉన్న వాళ్లిద్ద‌రూ స‌మ‌యం గ‌డిచేకొద్ది స్నేహితులుగా మారుతారు. ఒక‌రిపై మ‌రొక‌రికి అభిమానం క‌లుగుతుంది. ఈ జ‌ర్నీలో వారిద్దరి మధ్య క్రియేట్ అయిన ఎమోషనల్ బాండింగ్ గురించి తెలియజేసే సినిమాయే ‘పాప్ కార్న్’ అని ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది.

ముఖ ప‌రిచ‌యం లేని అబ్బాయి, అమ్మాయి ఓ షాపింగ్ మాల్‌లోకి ఎంట‌ర్ అవుతారు. అక్క‌డ షాపింగ్ పూర్తి చేసుకుంటారు. లిఫ్ట్ ఎక్కుతారు. ఎక్క‌గానే ఆ అమ్మాయి తాను లిఫ్ట్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవాల‌నుకుంటుంది. ఆ అబ్బాయి త‌న‌ని లాగి పెట్టి ఒక‌టి కొడ‌తాడు.అడిగితే ప్రాంక్ చేశానంటాడు . అలాంటి ఈజీ గోయింగ్ మైండ్ సెట్ ఉన్న అబ్బాయి.. త‌నొక‌ మ్యూజిషియ‌న్‌.. ఇక అమ్మాయి విష‌యానికి వ‌స్తే త‌నొక పెద్ద అంద‌గ‌త్తెన‌నే  అనే కాన్ఫిడెన్స్‌తో ఉంటుంది. ఇలాంటి భిన్న‌మైన మ‌న‌స్త‌త్వాలున్న వీరిద్ద‌రు అనుకోకుండా... షాపింగ్ మాల్‌లోని లిఫ్ట్‌లో ఇరుక్కుంటారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేది తెలియాలంటే ‘పాప్ కార్న్’ సినిమా చూడాల్సిందేన‌ని అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ సినిమాని ఫిబ్రవరి 10న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. 
 

click me!