ఈరోజు ఎపిసోడ్ లో యష్, వేదతో మాట్లాడుతూ హ్యాపీ నా అని అడగగా చాలా హ్యాపీగా ఉంది విలేజ్ లైఫ్ అనడంతో నేను విలేజ్ లైఫ్ గురించి మాట్లాడటం లేదు వేద మన మ్యారేజ్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాను అని అడుగుతాడు. నాతో హ్యాపీగా ఉన్నావా అని అడుగుతాడు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మీతో పెళ్లి నాకు ఒక కొత్త జన్మ అని అంటుంది వేద. నా జీవితం మొత్తం నాశనం అయ్యిందని డిస్టర్బ్ అయిందని మీకు తెలుసు. ఎంగేజ్మెంట్ వరకు వచ్చి కాదనుకొని వెళ్లిపోయాడు. అన్నింటికీ మించి జీవితంలో తల్లిని కాలేను అన్నావు పిడుగు లాంటి వార్త నన్ను కుప్ప కూల్చేసింది.