బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 షోకి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. అదే సమయంలో నాగార్జున 100వ చిత్రం కూడా తెరకెక్కుతోంది. ఈసారి బిగ్ బాస్ షోని కింగ్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
అక్కినేని నాగార్జున మరోసారి బిగ్‌బాస్ తెలుగు స్టేజీపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10కు ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. దీంతో తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో అత్యధిక సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన వ్యక్తిగా నాగార్జున కొత్త రికార్డును సొంతం చేసుకోనున్నారు. అంతేకాదు, భారతదేశంలో సల్మాన్ ఖాన్ తర్వాత అత్యధిక కాలం బిగ్‌బాస్ హోస్ట్‌గా కొనసాగిన రెండో వ్యక్తిగానూ ఆయన నిలవనున్నారు. బిగ్‌బాస్ హిందీ ప్రారంభం నుంచి సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా కొనసాగుతుండగా, తెలుగు వెర్షన్‌కు నాగార్జున మూడో సీజన్ నుంచి నిరంతరంగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
25
ఎన్టీఆర్, నాని తర్వాత నాగార్జున
తెలుగు బిగ్‌బాస్ తొలి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా, రెండో సీజన్‌ను నాని నడిపించారు. అనంతరం మూడో సీజన్ నుంచి నాగార్జున బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు రాబోయే పదో సీజన్‌తో ఆయన హోస్ట్‌గా ఎనిమిదోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో అత్యధిక సీజన్లను హోస్ట్ చేసిన ఘనతను మరింత బలపరుచుకోనున్నారు.
35
ఫుల్ బిజీగా కింగ్
ఇప్పటికే బిగ్‌బాస్ తెలుగు 10కు సంబంధించిన ప్రచార చిత్రీకరణను నాగార్జున పూర్తి చేశారు. షో ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చివరి దశకు చేరుకున్నాయి. కార్యక్రమం ప్రారంభమైన తర్వాత వచ్చే మూడు నుంచి నాలుగు నెలల పాటు నాగార్జున బిగ్‌బాస్ షూటింగ్‌తో బిజీగా ఉండనున్నారు. ప్రతి సీజన్ మాదిరిగానే ఈసారి కూడా ఆయన హోస్టింగ్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
మరోవైపు నాగార్జున తన సినీ కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రం పనులను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం కింగ్100గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఆయన కెరీర్‌లో మరో మైలురాయి కానుంది. ఒకవైపు బిగ్‌బాస్ తెలుగు 10, మరోవైపు 100వ సినిమా పనులతో నాగార్జున బిజీ షెడ్యూల్‌ను కొనసాగిస్తున్నారు. ఈ సారి బిగ్ బాస్ షోని నాగార్జున బాగా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. సీజన్ 9లో చాలా మార్పులు ఉంటాయని అంతా భావించారు. హౌస్ ని రెండుగా విభజించడం తప్ప అక్కడ చేసిన మార్పులు ఏమీ లేవు. సీజన్ 10 తో పాటు తన 100 సినిమా రెడీ అవుతోంది. ఈ రెండూ తన కెరీర్ లో గుర్తుండిపోయే విధంగా ఉండాలని నాగార్జున భావిస్తున్నారు. అందుకే బిగ్ బాస్ 10 ఆయన చాలా మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. నాగార్జున చెప్పిన మార్పులకు అనుగుణంగా బిగ్ బాస్ హౌస్ సెట్ వర్క్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.
55
రెండూ ఒకేసారి
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10తో పాటు కింగ్100 చిత్రం కూడా నాగార్జున కెరీర్‌లో మైలురాయి ప్రాజెక్టులుగా నిలవనున్నాయి. ఒకవైపు బుల్లితెరపై వరుసగా ఎనిమిదోసారి హోస్ట్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుండగా, మరోవైపు తన 100వ చిత్రాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు నాగార్జున కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించనున్నాయి.