నాగార్జునకి గర్ల్ ఫ్రెండ్స్ ని మార్చే అలవాటు ఉందా? ఒకరు పోతే మరొకరు.. ఎప్పుడూ ఖాళీ లేదు.. బోల్డ్ కామెంట్స్

Published : Jul 26, 2024, 06:35 PM ISTUpdated : Jul 26, 2024, 11:37 PM IST

నాగార్జున అంటే మన్మథుడిగా అంతా పిలుస్తుంటారు. ఇప్పటికీ ఆయనంటే పడి చచ్చే అమ్మాయిలుంటారు. కానీ నాగ్‌ మాత్రం ఓ సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు.   

PREV
15
నాగార్జునకి గర్ల్ ఫ్రెండ్స్ ని మార్చే అలవాటు ఉందా? ఒకరు పోతే మరొకరు.. ఎప్పుడూ ఖాళీ లేదు.. బోల్డ్ కామెంట్స్

నాగార్జున అంటే మన్మథుడు అనే ట్యాగ్‌ పడిపోయింది. రొమాన్స్ కి కింగ్‌గా అంతా చెబుతుంటారు. నాగ్‌ సైతం అలానే ఉంటాడు. ఎంత మంది హీరోలు మారిపోతున్నా, నాగార్జున మాత్రం ఇప్పటికీ అదే ఫిట్‌నెస్‌ని మెయింటేన్‌ చేస్తున్నారు. 66ఏళ్ల వయసులోనే 30ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారు నాగ్‌. గ్లామర్‌ ఏమాత్రం తగ్గడం లేదు. 
 

25
Nagarjuna - Tabu

నాగార్జునకి ఇండస్ట్రీలో గర్ల్ ఫ్రెండ్స్ కూడా చాలా మందే ఉంటారనే రూమర్స్ వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సీనియర్‌ హీరోయిన్ల నుంచి ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న హీరోయిన్ల వరకు అందరితోనూ ఆయన రొమాన్స్ చేశారు. ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్ లో ఆయన్ని మించిన వాళ్లు లేరని చెప్చొచ్చు. 

35
Nagarjuna Akkineni

అయితే నాగార్జున తన ఆఫ్‌ స్క్రీన్‌ రొమాన్స్ గురించి బయటపెట్టాడు. తాను గర్ల్ ఫ్రెండ్‌ లేని రోజు లేదని చెప్పి షాకిచ్చాడు నాగ్‌. ఒక గర్ల్ ఫ్రెండ్‌ పోతే మరో గర్ల్ ఫ్రెండ్ తనకు ఊహ తెలిసినప్పట్నుంచి ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నాడని తెలిపారు. ఒక అమ్మాయి తర్వాత మరో అమ్మాయి తన లైఫ్‌లోకి వస్తూనే ఉందని తెలిపి దుమారం రేపాడు నాగ్‌. 
 

45

అయితే ఆ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ తన ఫ్రెండ్స్ అని, ఎవరితోనూ బ్యాడ్‌ రిలేషన్‌ లేదని, వాళ్లంతా ఇప్పటికీ టచ్‌లోనే ఉంటారని, ఇప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉన్నారని, కానీ బ్యాడ్‌, బిట్టర్‌ రిలేషన్‌ షిప్‌ లేదని చెప్పాడు నాగ్‌. ఇప్పటికీ వాళ్లకి కాల్‌ చేసి మాట్లాడుతుంటానని వెల్లడించారు నాగ్‌. జయప్రదతో గతంలో ఓ చేసిన ఇంటర్వ్యూలో మన్మథుడు ఈ విషయాలను వెల్లడించారు నాగ్‌. ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. అయితే ఈ మాటలు విని ఆయన భార్య అమల రియాక్షన్‌ ఏంటనేది ఆసక్తికరం. 
 

55

నాగార్జున ఇప్పుడు సినిమాల విషయంలో రూట్‌ మార్చాడు. లవర్‌ బాయ్‌ స్టోరీస్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టి, ఏజ్‌కి తగ్గ పాత్రలు చేస్తున్నారు. అందులోనూ ఎంతో కొంత రొమాన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. ఇటీవల `నా సామి రంగ` చత్రంతో అలరించిన ఆయన ఇప్పుడు `కుబేర`, `కూలీ` చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నాడు. సోలో హీరోగా ఓ మూవీకి ప్లాన్‌ జరుగుతుంది. త్వరలోనే `బిగ్‌ బాస్‌ తెలుగు 8`తో రాబోతున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories