మరో మంచు హీరో విష్ణుకు జంటగా వస్తాడు నా రాజు టైటిల్ తో ఓ మూవీ చేసింది. ఇది డిజాస్టర్ అని చెప్పాలి. అనూహ్యంగా ప్రభాస్ మూవీ మిస్టర్ పర్ఫెక్ట్ లో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ పట్టేసింది. కాజల్ అగర్వాల్ ఆ మూవీలో మరొక హీరోయిన్. మిస్టర్ పర్ఫెక్ట్ తాప్సీ కెరీర్లో ఫస్ట్ హిట్ అని చెప్పొచ్చు. అనంతరం మొగుడు, వీర, దరువు, గుండెల్లో గోదావరి చిత్రాల్లో నటించింది.