నాగ చైతన్యకు కాబోయే రెండో భార్య కూడా బోల్డే... శోభిత దూళిపాళ్ల వేశ్యగా నటించిన మూవీ ఏంటో తెలుసా?

First Published | Aug 8, 2024, 12:02 PM IST

నాగ చైతన్య రెండో వివాహం చేసుకోకున్నారు. హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో ఆయనకు ఆగస్టు 8న నిశ్చితార్థం అట. కాగా ఓ చిత్రంలో శోభిత వేశ్య పాత్ర చేయడం విశేషం.. 
 

అక్కినేని వారి అబ్బాయి నాగ చైతన్య టైర్ టు హీరోల్లో ఒకరు. తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న నాగ చైతన్య పరిశ్రమలో రాణిస్తున్నారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఉన్నాయి. హీరోయిన్ సమంతను నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారు. 2017లో గోవా వేదికగా సమంత-నాగ చైతన్యల వివాహమైంది. హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాలలో పెళ్లి వేడుక నిర్వహించారు. 

Nagarjuna Akkineni

వివాహం తర్వాత కూడా సమంత నటన కొనసాగించింది. ఆమె బోల్డ్ రోల్స్ కూడా చేయడం విశేషం. సూపర్ డీలక్స్, ది ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత రొమాంటిక్ సీన్స్ లో నటించింది. నాగ చైతన్యతో విబేధాలకు ఇది కూడా ఓ కారణం ఆమె వాదన ఉంది. ఏది ఏమైనా 2021 అక్టోబర్ నెలలో సమంత-నాగ చైతన్య విడాకుల ప్రకటన చేశారు. 


సమంత సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తుంది. నాగ చైతన్య మాత్రం హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో రిలేషన్ లో ఉన్నాడనే వాదన ఉంది. శోభిత-నాగ చైతన్య విదేశాల్లో చక్కర్లు కొడుతున్న కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే ఈ ఎఫైర్ రూమర్స్ ని నాగ చైతన్య టీమ్ ఖండించారు. కాగా ఆగస్టు 8న శోభితతో నాగ చైతన్య నిశ్చితార్థం అని పరిశ్రమ వర్గాల సమాచారం. అత్యంత సన్నిహితుల మధ్య నాగ చైతన్య, శోభితల నిశ్చితార్థం ప్లాన్ చేశారట. 
 

తెలుగు అమ్మాయి అయిన శోభిత ధూళిపాళ్ల కూడా బోల్డ్ హీరోయినే. ఆమె ఓ చిత్రంలో ఏకంగా వేశ్య పాత్ర చేసింది. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ దేవ్ పటేల్ హీరోగా నటించిన మంకీ మ్యాన్ మూవీలో శోభిత వేశ్యగా కనిపించింది. ఆమె పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుంది. మంకీ మ్యాన్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మంకీ మ్యాన్ చిత్రానికి దేవ్ పటేల్ దర్శకుడు కూడాను. 

శోభిత వైజాగ్, ముంబైలలో చదువుకుంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2016లో రామన్ రాఘవ్ 2.0 అనే చిత్రంతో  సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాల్లో నటించింది. శోభిత ప్రస్తుతం సితార టైటిల్ తో ఒక చిత్రం చేస్తుంది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వం చిత్రాల్లో శోభిత నటించిన విషయం తెలిసిందే... 

Latest Videos

click me!