డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ రివ్యూ, క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్..అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్, హైలైట్స్ ఇవే

First Published | Aug 8, 2024, 12:49 PM IST

సెన్సార్ సభ్యులు నుంచి వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే.. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ అని ప్రశంసించారట. పూరి మార్క్ సన్నివేశాలు, రామ్ పోతినేని ఎనెర్జిటిక్ పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో ప్రధాన హైలైట్స్ అని చెబుతున్నారు.

రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో త్వరలో రిలీజ్ కాబోతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. అటు రామ్ పోతినేని, ఇటు పూరి జగన్నాధ్ ఇద్దరికీ డబుల్ ఇస్మార్ట్ చిత్రం హిట్ కావడం చాలా అవసరం. రామ్ కి ఇటీవల సరైన హిట్స్ లేవు. పూరి చివరి చిత్రం లైగర్ దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. 

దీనితో డబుల్ ఇస్మార్ట్ పై  ఇద్దరూ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలైన విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పూరి తన అనుభవాన్ని అంతా రంగరించి మంచి మాస్ మాసాల చిత్రం తెరకెక్కించినట్లు ట్రైలర్ రిలీజ్ కాగానే కామెంట్స్ వినిపించాయి. మరో వారం రోజుల్లోనే ఆగష్టు 15న ఈ చిత్రం రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ చిత్రంలో విలన్ గా నటించారు. 


Double iSmart

తాజాగా డబుల్ ఇస్మార్ట్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీనితో సెన్సార్ నుంచి డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని 'ఎ ' సర్టిఫికెట్ అందించారు. ఇది ఊహించిందే అని చెప్పొచ్చు. ఇక చిత్రం 2 గంటల 42 నిమిషాల రన్ టైం తో ఉండబోతోంది. కాస్త లేన్తి అనే చెప్పాలి. కానీ పూరి, రామ్ పోతినేని ఎంటర్టైన్ చేస్తే రన్ టైం ఇష్యూ కాకపోవచ్చు. 

సెన్సార్ సభ్యులు నుంచి వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే.. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ అని ప్రశంసించారట. పూరి మార్క్ సన్నివేశాలు, రామ్ పోతినేని ఎనెర్జిటిక్ పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో ప్రధాన హైలైట్స్ అని చెబుతున్నారు. కమర్షియల్ గా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ పక్కా అనే రెస్పాన్స్ వచ్చిందట. రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ ఇద్దరికీ డబుల్ ఇస్మార్ట్ చిత్రం మాస్ కంబ్యాక్ ఇస్తుందని అంటున్నారు. 

సంజయ్ దత్, రామ్ పోతినేని మధ్య మైండ్ గేమ్ తో సాగే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందట. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. అంటే పూరి జగన్నాధ్ ప్లానింగ్ మామూలుగా లేదని అర్థం అవుతోంది. 

ఫస్ట్ పార్ట్ ని మించేలా డబుల్ ఇస్మార్ట్ చాలా గ్రాండ్ గా ఉందట. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా కంప్లీట్ గా ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. పూరి, ఛార్మి తమ సొంత ప్రొడక్షన్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. మూవీ రిలీజ్ కి ముందు వచ్చిన సెన్సార్ రివ్యూ డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి మంచి బజ్ తీసుకువస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. 

Latest Videos

click me!