మామా అల్లుడుతో బ్యాక్‌ టూ బ్యాక్‌ మూవీస్‌.. నాగార్జున దాన్ని ముందే పసిగట్టాడా? నాగ్‌ మామ ప్లాన్‌ కేక..

Published : Apr 21, 2024, 02:07 PM IST

మన్మథుడు నాగ్‌.. సినిమాలో వస్తోన్న ట్రెండ్‌ని ముందే పసిగట్టాడు, దీంతో దానికి తగ్గటుగా ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు రజనీతో సినిమా చేస్తున్నారని తెలుస్తుంది.    

PREV
18
మామా అల్లుడుతో బ్యాక్‌ టూ బ్యాక్‌ మూవీస్‌.. నాగార్జున దాన్ని ముందే పసిగట్టాడా? నాగ్‌ మామ ప్లాన్‌ కేక..

కాలం తగ్గట్టుగా సినిమాల్లో చాలా మార్పులు వస్తాయి. హీరోలు కూడా ఆ ట్రెండ్‌ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. లేదంటే కనుమరుగు అయిపోవాల్సిందే. ట్రెండ్‌ని పట్టుకుని ముందుకు వెళ్తే లాంగ్‌ కెరీర్‌ సాధ్యమవుతుంది. ఇది దర్శకులు, నిర్మాతలకే కాదు, హీరోలకు కూడా వర్తిస్తుంది. హీరోయిన్లు కూడా ఫాలో అవ్వాల్సిందే. లేదంటే ఆడియెన్స్ మర్చిపోవడం ఖాయం.  
 

28

ఈ విషయంలో నాగార్జున ముందే ఉంటున్నాడు. ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. సినిమాల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా తాను కూడా ఛేంజ్‌ అవుతూ రాణిస్తున్నారు. తర్వాత ఏం జరగబోతుందో ముందే ఊహించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరగానే తేరుకుని ముందుకెళ్తున్నారు. తనని తాను మార్చుకుంటూ వెళ్తున్నారు. ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. తాను ఎవరితో యాక్ట్ చేసేందుకైనా సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తున్నాడు. 
 

38

నాగార్జున ముందు నుంచి ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. గెస్ట్ రోల్స్ తోపాటు, కీలక పాత్రలు, మల్టీస్టారర్స్ చేశారు. మోహన్‌బాబు, శ్రీకాంత్‌, కార్తీ, నాని,  నాగచైతన్యలతో కలిసి సినిమాలు చేశారు. అంతకు ముందు కృష్ణ, తండ్రి ఏఎన్నార్‌తోనూ కలిసి సినిమాలు చేశారు. అలాగే హిందీలోనూ అప్పుడప్పుడు సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య `బ్రహ్మాస్త్ర`లో మెరిశారు. ఇప్పుడు మరింత జోరు పెంచారు. ఇప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తున్నారు. 
 

48

ప్రస్తుతం నాగార్జున మామా, అల్లుడుతో కలిసి సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ధనుష్‌ తో `కుబేర` చిత్రంలో నటిస్తున్నారు. మల్టీస్టారర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. పేదవాడు, కుబేరుడి మధ్య రిలేషన్‌, ఫైట్‌ ప్రధానంగా ఈ మూవీ సాగుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో నాగార్జునది కీలక పాత్ర అని తెలుస్తుంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. 
 

58

దీంతోపాటు ఇప్పుడు మామ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తోనూ సినిమా చేస్తున్నారు. రజనీకాంత్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు. తలైవా171 పేరుతో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం నాగార్జునని సంప్రదించగా ఆయన ఓకే చేశారట. ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్‌లో ఫైనల్‌ అయ్యిందని సమాచారం.

68

ఇదే నిజమైతే మొదటిసారి రజనీ, నాగార్జున తెరని పంచుకోబోతున్నారని చెప్పొచ్చు. గతంలో `శాంతికాంతి` అనే సినిమాని తెలుగులో నాగ్‌ చేస్తే, తమిళంలో రజనీ చేశారు. కానీ కలిసి నటించలేదు. ఇప్పుడు మొదటిసారి కలవబోతుండటంతో ఫ్యాన్స్ ఫుల్‌ హ్యాపీ అవుతున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

78

ఇక 80వ దశకంలో దేశాన్ని ఊపేసిన బంగారం స్మగ్లింగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ మూవీ సాగుతుందని తెలుస్తుంది. ఇప్పటికే రజనీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు లోకేష్‌ కనగరాజ్‌. ఇందులో గోల్డ్ వాచ్‌లతో రజనీ మార్క్ స్టయిలీష్‌ లుక్‌ అదరగొట్టింది. ఇక సినిమా ఎలా ఉంటుందో, అనేది చూడాలి. 
 

88
Nagarjuna Akkineni

నాగార్జున ఈ ఏడాది `నా సామి రంగా` చిత్రంతో హిట్‌ అందుకున్నారు. అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌లతో కలిసి నటించాడు. సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. సోలో హీరోగా మరో మూవీకి రెడీ అవుతున్నారు. మధ్యలో ఇలాంటి మల్టీస్టారర్‌లు కూడా చేసేందుకు రెడీగా ఉన్నారు. సోలో హీరోగా ఇటీవల నాగ్‌కి హిట్లు రావడం లేదు. దీంతో ఆయన ఇలా రూట్‌ మార్చి మల్టీస్టారర్లు చేస్తూ సక్సెస్‌ అందుకుంటున్నాడని చెప్పొచ్చు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories