తనలోని గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తున్న హోమ్లీ బ్యూటీ లావణ్య  త్రిపాఠి.. డెనిమ్ జీన్స్ లో బోల్డ్ ఫోజులతో రచ్చ

First Published Jan 17, 2022, 9:22 AM IST


టాలెంటెడ్ యాక్ట్రెస్ అన్న ఇమేజ్ తో పాటు ఖాతాలో సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ టాలీవుడ్ లో నిలదొక్కుకోలేక పోయింది లావణ్య త్రిపాఠి (Lavanya Thripathi). దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరింది లావణ్య కెరీర్.

హోమ్లీ హీరోయిన్ గా ఆ తరహా పాత్రలే చేసిన లావణ్య ఇప్పుడు పంథా మార్చారు. తనలోని హాట్ నెస్ ని పరిచయం చేస్తూ ఫోటో షూట్స్ చేస్తుంది.


సోషల్ మీడియా వేదికగా లావణ్య గ్లామరస్ ఫోటో షూట్స్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఆమెలోని కొత్త యాంగిల్ చూసిన ఫ్యాన్స్ షాకవుతున్నారు. అవకాశాల కోసం లావణ్య కొత్త అవతారం ఎత్తినట్లు అనిపిస్తుంది. స్కిన్ షోకి తెరలేపుతూ ఎలాంటి పాత్రకైనా సిద్దమే అన్న సందేశం దర్శక నిర్మాతలకు పంపుతుంది.


తాజాగా లావణ్య డెనిమ్ షర్ట్, జీన్స్ ధరించి బోల్డ్ లుక్ లో దర్శనం ఇచ్చింది.  అమ్మడు అందాలకు తోడు గుచ్చేసే చూపులు మరింతగా మనసులు డామేజ్ చేస్తున్నాయి. లావణ్య నయా గ్లామర్ షో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. దీనితో మైండ్ బ్లాక్ కావడంతో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 


లావణ్య మొదటి చిత్రం అందాల రాక్షసి. టై యాంగిల్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన అందాల రాక్షసి చిత్రంలో లావణ్య నటన అద్భుతం. అల్లరి పిల్లగా లావణ్య అదరగొట్టేసింది. ఆ సినిమాతో లావణ్య ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. 

భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా(Soggade chinni nayana) వంటి వరుస హిట్స్ దక్కినా, హీరోయిన్ గా బిజీ కాలేకపోయారు. నాగార్జున(Nagarjuna)ను మినహాయిస్తే టూ టైర్ హీరోలతోనే లావణ్య కెరీర్ సాగింది. కెరీర్ బిగినింగ్ లో హిట్ సినిమాలలో నటించి కూడా పునాది చేసుకోలేకపోయింది.  టాలెంట్ ఉన్నా లక్ లేక రేసులో వెనుకబడిపోయింది. 
 

ఒక్క స్టార్ హీరో పక్కన కూడా లావణ్యకు ఆఫర్ రాలేదు. అర్జున్ సురవరం మూవీతో ఫార్మ్ లోకి వచ్చింది అనుకుంటే... ఏ వన్ ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలు చావు దెబ్బతీశాయి. ఈ రెండు చిత్రాలు పరాజయం కావడంతో లావణ్య కెరీర్ మరింత దెబ్బతింది.
 


ప్రస్తుతం లావణ్య కెరీర్ ప్రమాదంలో పడింది. ఆమెకు అవకాశాలు దాదాపు కనుమరుగయ్యాయి. ఒక్క కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన దాఖలాలు లేవు.  హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ తో లావణ్య కెరీర్ మొదలు కాగా, ఆ తరహా పాత్రలే ఆమెకు దక్కాయి. అది కూడా ఆమెకు మైనస్ గా మారింది.

click me!