కాబోయే కోడలు శోభితతో నాగార్జున తొలిసారి ఏం మాట్లాడారో తెలుసా..చైతుకి నచ్చినట్లే పెళ్లి, నాగ్ కామెంట్స్

First Published | Nov 22, 2024, 1:49 PM IST

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాల మరికొన్ని రోజుల్లో దంపతులుగా వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో వీళ్లిద్దరి పెళ్లి జరగనుంది.

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాల మరికొన్ని రోజుల్లో దంపతులుగా వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో వీళ్లిద్దరి పెళ్లి జరగనుంది. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న శోభిత, చైతు ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి నుంచి జంటగా కనిపిస్తూ ఫ్యాన్స్ కి కనువిందు చేస్తున్నారు. 

కాబోయే కోడలు శోభిత గురించి మామగారు నాగార్జున తొలిసారి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా మీడియా ఇంటరాక్షన్ లో నాగార్జున.. శోభిత, చైతు వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు తాను శోభితతో తొలిసారి మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. గూఢచారి చిత్రం రిలీజ్ అయిన తర్వాత శోభితకి ఫోన్ చేసి అభినందించాను. 


ఆ చిత్రంలో శోభిత చాలా బాగా నటించింది. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటికి రమ్మని ఆహ్వానించాను. కానీ ఇంతలోపే చైతన్య, శోభిత ఒక్కటయ్యారు అని నాగార్జున అన్నారు. ఈ ఏడాది మా ఫ్యామిలీకి చాలా ప్రత్యేకమైనది. నాన్నగారి శతజయంతి వేడుకలు జరిగాయి. ఆయనకి అన్నపూర్ణ స్టూడియోస్ చాలా ఇష్టమైన ప్రదేశం. చైతు, శోభిత పెళ్లి కూడా అక్కడే జరగబోతోంది. 

పెళ్లి పనులని చైతు, శోభిత ఇద్దరూ చూసుకుంటున్నారు. నాగ చైతన్య ఇష్టప్రకారమే పెళ్లి సింపుల్ గా ఉండాలని నిర్ణయించాం. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులతో కలిపి 300 మంది గెస్టులని ఆహ్వానిస్తున్నట్లు నాగార్జున తెలిపారు. వెళ్లి వేదికని అందంగా డిజైన్ చేస్తున్నారు అని నాగార్జున తెలిపారు. 

రీసెంట్ గా అక్కినేని ఫ్యామిలీ గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో నాగ చైతన్య, శోభిత జంటగా కనిపించారు. నాగ చైతన్య శోభితని ఎంతో కేరింగ్ గా తీసుకెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Latest Videos

click me!