రచ్చ - వాన వాన వెల్లువాయే
రాంచరణ్ సూపర్ హిట్ చిత్రం రచ్చ మూవీలో వాన వాన వెల్లువాయే సాంగ్ ని మణిశర్మ రీమిక్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి గ్యాంగ్ లీడర్ చిత్రంలోని ఈ పాట ఎంత సంచలనం సృష్టించిందో చెప్పనవసరం లేదు. రచ్చ చిత్రంలో ఈ సాంగ్ విజువల్ పరంగా ఆకట్టుకుంది. రాంచరణ్, తమన్నా కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. కానీ సాంగ్ ని చెడగొట్టారు అంటూ మణిశర్మపై విమర్శలు వచ్చాయి.