గట్టిగ గడ్డిపెట్టిన నాగార్జున, బిగ్ బాస్ ఇంట్లో మీపెత్తనమేంటి.. నచ్చకపోతే వెళ్ళిపోండంటూ వార్నింగ్

First Published | Sep 21, 2024, 11:54 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మూడోవ వీకెండ్ లో.. కింగ్ నాగార్జున తన విశ్వరూపం చూపించాడు. బిగ్ బాస్ ఇల్లు ఆయన ఇష్టం. మీకు నచ్చకపోతే గెట్ అవుట్ అంటూ ఫైర్ అయ్యారు కింగ్. 

Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతీ వీకెండ్ కోసం హౌస్ మెంట్స్ తో పాటు ఆడియన్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తుంటారు. ఈక్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 8 లో మూడో వీకెండ్ రానే వచ్చింది. 

Bigg boss telugu 8

ఇక వచ్చీరావడంతోనే ఒక్కొక్కరికి రేవెట్టేశారు నాగార్జున. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా అంటూ.. వీడియోలు వేసి మరీ ఇచ్చిపడేశారు. మరీ ముఖ్యంగా ఎన్నో సార్లు నోరు జారి అభయ్ కు గట్టిగా క్లాస్ పడింది. బిగ్ బాస్ కంటే ఎక్కువ అనుకుంటే వెళ్ళిపోవచ్చు అంటూ.. గేట్లు ఓపెన్ చేశారు బిగ్ బాస్. 


Bigg boss telugu 8

 బిగ్ బాస్ సీజన్ 8 లో .. రెండు వారాల పాటు చాలా డీసెంట్ గా ఉన్న అభయ్ నవీన్..చీఫ్ అయిన తరువాత తన అసలు రూపం చూపించాడు. చీఫ్ గా సెలక్ట్ అయిన అభయ్.. టీమ్ ను లీడ్ చేయడంలో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు. ఎగ్ టాస్క్ లో ఎగ్స్ ను కాపాడుకోలెక చేతులు ఎత్తేశాడు.
 

పట్టుదలతో గేమ్ ఆడుతున్న మణికంఠ అభయ్ గేమ్ ను గట్టిగా విమర్శించారు. ఇక ఆతరువాత బిగ్ బాస్ మీద అభయ్ నోరు పారేసుకోవడం ఎవరికీ నచ్చలేదు. నోటికి వచ్చినట్టు బిగ్ బాస్ ను తిడుతు.. బుర్రలేదు, బయాస్, బిగ్ బాస్ మీద వ్యతిరేకంగా ఇంటర్వ్యూల్లో చెపుతా.. ఇలా చాలా రకాలుగా బిగ్ బాస్ ను అన్నాడు అభయ్. 

దాంతో రెండు మూడుసార్లు బిగ్ బాస్ అభయ్ ను హెచ్చరించినా కూడా అతనిలో ఎటువంటి మార్పు లేకపోవడంతో నోటికి హద్దు అదుపు లేదు అన్నట్టు గా ప్రవర్తించిన అభయ్ పై వేటు పడింది. నాగార్జున వచ్చీ రాగానే అభయ్ పై ఫైర్ అవ్వడంతో పాటు.. అతనికి రెడ్ కార్డ్ ఇచ్చి గెట్ అవుట్ అంటూ గేట్లు తీశారు. 
 

ఇక వీరితో పాటు సోనియా, ప్రేరణ, విష్ణు ప్రియ, యష్మి, మణికంఠ, పృధ్వి, ఆదిత్యలకు కూడా క్లాస్ పడింది. ఇక నబిల్, నైనిక, నిఖిల్ కాస్త ఈ క్లాస్ నుంచి తప్పించుకోగలిగారు. ఇక విష్ణు ప్రియ ‌- ప్రేరణ గొడవలో కూడా నాగార్జున క్లారిటీ ఇవ్వడంతో పాటు. వారిమధ్య గొడవలను ఉండకూడని..సెటిలమెంట్  చేసేశారు. 
 

Bigg Boss Telugu 8

ఇక పృధ్వి అగ్రసీవ్ నెస్, మణికంఠ చేస్తున్న పొరపాట్లు, ప్రేరణ నోరు జారడం లాంటి వాటిపై కూడా ఆయన గట్టిగా ఇచ్చుకున్నారు. మొత్తానికి క్లాస్ తీసుకున్నా నాగార్జున. .ఎవరినీ సేవ్ చేయకుండానే శనివారం ఎపిసోడ్ ను ముగించారు. ఇక సండే ఫన్ డే తో పాటు..ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది. అంది కూడా అభయ్ ఎలిమినేట్ అయ్యాడని టాక్. మరి అందులో నిజం ఎంతో తెలియాలంటే.. వెయిట్ చేయాల్సిందే. 

Latest Videos

click me!